Breaking News

ప్రభుత్వం ఫుడ్‌పాయిజన్‌, ఇండస్ట్రీలలో, కాలేజీల్లో, ఫ్యాక్టరీల్లో భద్రతాచర్యలపై మరియు పెరిగిపోతున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి

-నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ, ఏపీ స్టేట్‌ కన్వీనర్‌ జమీల్‌ అహ్మద్‌బేగ్‌ వినతి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలలుగా ప్రభుత్వ, ప్రైవేటు- వసతి గృహాలలో జరుగుతున్న ఫుడ్‌ పాయిజన్‌పైన దృష్టి పెట్టాలని కోరుతున్నట్లు- నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కన్వీనర్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ తెలిపారు. అలాగే ఇండస్ట్రీలు, కాలేజీలు, స్కూళ్లలోని ల్యాబ్‌లలో సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో జరుగుతున్న అనర్థాలపైన దృష్టి సారించి కట్టు-దిట్టమైన భద్రతా చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు- తెలిపారు.. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్న అక్రమ కట్టడాలపై తగిన చర్యలు తీసుకోవాలని గురువారం ఎన్టీఆర్‌ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకు వినతి పత్రం అందజేసినట్లు- నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ, ఏపీ స్టేట్‌ కన్వీనర్‌ జమీల్‌ అహ్మద్‌బేగ్‌ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *