Breaking News

వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి

-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయలు కీర్తించిన తెలుగు భాషను.. గ్రాంథికం నుంచి వాడుకకు తీసుకొచ్చిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి అని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవహార భాషా ఉద్యమ కర్త గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనం నందు గురువారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు భాష అభివృద్ధికి గిడుగు అందించిన సేవలను కొనియాడారు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి ఆయనే మూలపురుషుడని కీర్తించారు. గ్రాంథిక భాష రాజ్యమేలుతున్న రోజుల్లో వాడుక భాషోద్యమానికి వెన్నుదున్నుగా నిలిచిన కవి గిడుగు రామ్మూర్తి అని చెప్పారు. నాలుగు దశాబ్దాలకు పైగా గ్రాంథికవాదులతో పోరాడి, వ్యావహారిక భాషకు పట్టం కట్టారన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు వెంకట రామమూర్తి ఒకరు అని చెప్పుకొచ్చారు. గిడుగు వంటి ఎందరో భాషా ప్రేమికులు, కవులు, రచయితలు ఇచ్చిన స్పూర్తితో.. తెలుగు భాషలోని తీయదనాన్ని నవతరానికి, భావితరాలకు అందించడం కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు చల్లా సుధాకర్, యక్కల మారుతీ, శంకర్, ప్రేమ్, మీసాల సత్యనారాయణ, నాగేంద్ర, అనిల్, ఎస్. డి. బాబు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *