Breaking News

జిల్లాలో ఫోటోఓటర్ల జాబితాల డోర్ టు డోర్ వెరిఫికేషన్ కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఫోటో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2025 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఫోటోఓటర్ల జాబితాల డోర్ టు డోర్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు.

జాయింట్ కలెక్టర్ గురువారం తమ ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించి, వారికి జిల్లాలో నిర్వహిస్తున్న ఫోటోఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షేప్తి సవరణ కార్యక్రమం షెడ్యూల్ వివరించారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఫోటోఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఫోటో ఓటర్ల జాబితాల డోర్ టు డోర్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు, ఈ కార్యక్రమం పై ముందుగా బిఎల్ఓ లకు తగిన అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. డోర్ టు డోర్ వెరిఫికేషన్ లో మరణించిన ఓటర్ పేరు జాబితా నుండి తొలగించడానికి, షిఫ్ట్ అయితే సవరించడానికి, 18 సంవత్సరాలు దాటిన వారిని కొత్త ఓటర్ గా ఫారం-6 ద్వారా నమోదు చేయడానికి, జాబితాలలో సరిగా ఫోటోలు కనిపించక పోయిన, తప్పులు ఉన్న నిబంధనల మేరకు సవరణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 29 నాటికి పూర్తి చేసి సమగ్ర ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ జాబితాలపై క్లెయిములు అభ్యంతరాలు నవంబర్ 28 వరకు స్వీకరించడం జరుగుతుందని అన్నారు..

జిల్లాలో నవంబరు 9, 10 మరియు 23, 24 తేదీలు శని, ఆదివారాలలో జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో బి ఎల్ వో లు అందుబాటులో ఉండి ఓటర్ల జాబితాలు, సంబంధిత ఫారాలు అందుబాటులో ఉంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 24 నాటికి క్లెయిమ్ లు, అభ్యంతరాలు పరిష్కరించడం, 2025 జనవరి 6 నాటికి తుది ఫోటో ఓటర్ల జాబితాలు ప్రచురించడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. డోర్ టు డోర్ వెరిఫికేషన్ కార్యక్రమం పక్కాగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ కేంద్రాల భవనాలు పాడవడం, ఓకే కేంద్రంలో ఎక్కువమంది ఓటర్లు ఉండడం, గత ఎన్నికలలో పోలింగ్ కేంద్రాల్లో ఏవైనా సమస్యలు గుర్తిస్తే, వాటిని తన దృష్టికి తీసుకురావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు జాయింట్ కలెక్టర్ సూచిస్తూ, తద్వారా పోలింగ్ కేంద్రాల రేష్నలైజేషన్ ప్రతిపాదనలు ఎన్నికల సంఘానికి పంపడానికి వీలవుతుందన్నారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ శ్రీదేవి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బత్తిన దాసు (తెలుగుదేశం), పంతం గజేంద్ర (బిజెపి), సిలార్ దాదా (వైసిపి), కొడాలి శర్మ (సిపిఎం), బాలాజీ (బి.ఎస్.పి), కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *