Breaking News

ఎన్టీఆర్ వైద్య సేవలు ఉచితంగా అందించాల్సి ఉంది

-వైద్య పరీక్షలు సేవల కోసం ఎటువంటి రుసుము వసూలు చేయరాదు
-మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ ఆరోగ్య వైద్యశాల విషయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు సమర్థవంతంగా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా క్రమశిక్షణ కమిటీ సభ్యులతో కూడి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ అర్హత కలిగిన హెల్త్ కార్డు కలిగిన లబ్ధిదారులకు వైద్య సేవలు అందించడంలో , వైద్య పరీక్షలు నిర్వహించడంలో జవాబుదారితనంతో కూడి వ్యవహరించాల్సిందని స్పష్టం చేశారు. వైద్య సేవలు అందించే క్రమంలో లబ్ధిదారుల నుండి నగదు వసూల్ చేస్తున్నట్లు ఫిర్యాదుల వస్తున్నాయని అటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వైద్య సేవలు పరీక్షలు ఉచితంగా అందించాల్సి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవల కోసం మూడు షిఫ్టుల్లో 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంచాల్సి ఉంటుందన్నారు. ఆసుపత్రులలో పరిసరాలు పరిశుభ్రత సానిటేషన్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రశాంతి సూచించారు. ఆస్పత్రిలో వైద్య సేవలు అందించే క్రమంలో నగదు వసూలు ఫిర్యాదులు అందిన వాటికీ సంబంధించి బిల్లుల చెల్లింపులు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. వైద్య పరీక్షలు సేవలు కోసం ఎవరైనా ఆసుపత్రి వర్గాలు నగదు వసూలు చేస్తే వాటిని తిరిగి చెల్లింపులు చేయాలని కోరారు. రోగి డిశ్చార్జి చేసే సమయంలొ 10 రోజులకు సరిపడే మందులు, రవాణా చార్జీలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వైద్య సేవలు అందించే సమయంలో నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. దంత వైద్య సేవలు అందించే క్రమంలో ఇంప్లాంట్స్, పరీక్షలు, ఇతర సేవలు అందించే క్రమంలో అదనపు రుసుములను ఎట్టి పరిస్థితుల్లోనూ వసూలు చెయ్యరదన్నారు. వైద్య మిత్రాలను నియమించడం, నిరంతర విద్యుత్, సీసీ కెమెరాల ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం, స్టేషనరీ అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య సేవలకు చెందిన సమగ్ర వివరాలు అప్లోడ్ చెయ్యాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మరింతగా ఎన్టీఆర్ వైద్య సేవలు అందించే క్రమంలో దృష్టి పెట్టాలని ఆదేశించారు.

క్రమశిక్షణ కమిటీ సమావేశం:
వైద్య సేవలు అందించే క్రమంలో నగదు వసూలు, సరియైన చికిత్స అందించడం లేదని, వైద్య పరీక్షల కోసం నగదు వసూలు, మౌలిక వసతులు కల్పించడం వాటిపై 11 ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. వాటికీ సంబంధించి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోవడం జరిగిందనీ వైద్యే అధికారి వివరించారు. ఇటువంటివి పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం పై ఉందన్నారు.

ఈ సమావేశంలో జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ డా. పి ప్రియాంక, జిల్లా ఆరోగ్య అధికారి డా కే వెంకటేశ్వరరావు, డి సి హెచ్ ఎస్ డా.ఎన్ పీ పద్మశ్రీ, , ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రతినిధులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *