Breaking News

మిషన్ హరిత ఆంధ్ర ప్రదేశ్ – “వనం మనం” విజయవంతం చెయ్యాలి

-ఆగస్ట్ 31 ఉదయం 5 గంటల నుంచి పెన్షన్ పంపిణి చెయ్యాలి
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా 5169 పెన్షన్ పంపిణి అధికారుల ద్వారా 2,39,152 మందికి పింఛన్లు పంపిణి చేసేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి డివిజన్, మండల స్థాయి, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరిత ఆంద్రప్రదేశ్, ఎన్టీయార్ భరోసా పెన్షన్ పంపిణి పై దిశా నిర్దేశనం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, హరిత ఆంద్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఒక సామాజిక బాధ్యత చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆగస్ట్ 29 నుంచి నవంబరు 1 వ తేదీ వరకూ ఆమేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతీ రోజూ ఒక్కో విభాగం ఒక రోజు కేటాయించడం ద్వారా మరింత సమర్థవంతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. తల్లి పేరుతో ఒక మొక్క నాటి వాటి విషయంలో పరిరక్షణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఉపాధిహామీ పథకం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఎంపిడిఓ లో ప్రతిపాదన లు పంపాలన్నారు. ప్రభుత్వాలు స్మశాన వాటికలు కెనాల్ బండ్లు పాఠశాలలో కాలేజీలలో, పరిశ్రమలలో ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను ఉన్న స్థాయి అధికారులను భాగస్వామ్ చేయాలని కలెక్టర్ ప్రశాంతి తెలియజేశారు.. గ్రామస్తులను భాగస్వామ్యం చేయడంలో సర్వ తీసుకోవాలని పేర్కొన్నారు. సెన్సాయి సంఘాల సభ్యులతో ఆధ్వర్యంలో వాళ్ళ ఇంటి వద్ద కరేపాకు మునగాకు వంటి మొక్కలు నాటి కార్యక్రమాన్ని చేపట్టాల్సిన ఉంటుందన్నారు. పూర్తి జోకుడి హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి భాగస్వామి చేపట్టడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
హరితహారం కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి సంవత్సరం మిలియన్ల మొక్కలను నాటడం మరియు పెంపకం చేయడం ద్వారా రాష్ట్రంలోని 24% నుండి 33% వరకు పచ్చదనం పెంచడం. ఈ కార్యక్రమం సంరక్షించడం మరియు వాటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కూడా లక్ష్యంగా పెట్టుకుందని తెలియ చేశారు

ఆగస్టు 31న పెన్షన్ పంపిణీ
జిల్లా వ్యాప్తంగా 512 సచివాలయం పరిధిలో 2,39152 మంది పెన్షన్ లబ్ధిదారులకు 9041 క్లస్టర్ పరిధిలోని ఐదువేల 169 మంది పెన్షన్ పంపిణీ అధికారులను భాగస్వామ్యం చేస్తూన్నట్లు కలెక్షన్ ప్రశాంతి తెలియజేశారు. ఉదయం 5:00 కల్లా పెన్షన్లను పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని, అందుకే అనుమానంగా జిల్లా మండల పిడి డిఆర్డిఏ ఆధ్వర్యంలోని కంట్రోల్ రూం విధుల్లో ఉండాలన్నారు. ఆగస్టు 31 శనివారం ఉదయం 5 గంటలకు పెన్షన్ పంపిణీ ప్రారంభించి 12:00 కల్లా పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. అనుగనగనగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా ప్రతినిధుల సమక్షంలో కొనసాయి అధికారులు సమక్షంలోను పెన్షన్ అందజేయాల్సి ఉందన్నారు. పెన్షన్ నగదు ఇవ్వడానికి, రసీదు తీసుకోవడానికి అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో కలెక్టర్ నుండి ప్రత్యేక అధికారులు తదితరులు హాజరయ్యారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *