-తిరుపతి నగరంలో సీసీ కెమెరాలను త్వరగా ఏర్పాటు చేయాలి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేయించాలని స్మార్ట్ సిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాలు నందు స్మార్ట్ సిటీ ఎం.డి, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అధ్యక్షతన స్మార్ట్ సిటీ 35వ బోర్డు మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, తుడా ఇంచార్జ్ వి.సి.వెంకట నారాయణ, రామచంద్రారెడ్డి, రమాశ్రీ లు పాల్గొనగా, ఈ అండ్ సి బాలకృష్ణా రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. గత బోర్డు మీటింగ్ నిర్ణయాలు, అకౌంట్స్ గురించి వివరించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ … స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని అన్నారు. 70 శాతం పూర్తి అయిన పనులకు నిధులు విడుదల చేసి వెంటనే పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న నిధుల వివరాలను ప్రభుత్వం కు తెలియజేయాలని అన్నారు. నగరంలో సిసి కెమెరా ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ భవనం నిర్మాణ పనులకు నిధులు విడుదల చేసి త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో యాత్రికులు, ప్రజల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, జి. ఎం. చంద్రమౌళి, మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, ఏఎస్పీ నాగభూషణ రావు, డిఎస్పి లు వెంకట నారాయణ, రామకృష్ణ ఆచారి, ఏఇకామ్ ప్రతినిధి బాలాజీ, స్మార్ట్ సిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.