Breaking News

ఆగష్టు నెల NTR భరోసా పెన్షన్ లు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ నెల 31న ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ల పంపిణీ

-ఏదేని కారణాల వలన మిగిలిపోయిన వారికి సెప్టెంబర్ 2న మాత్రమే పెన్షన్ల పంపిణీ
-ఆగస్ట్ 31న శనివారం ఉదయం 6గం. లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలి… ఒక్క నిమిషం ఆలస్యమైనా ఉపేక్షించేది లేదు: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
NTR భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సెప్టెంబర్ నెలలో పంపిణీ చేయాల్సినవి సచివాలయ సిబ్బంది ద్వారా ఈ నెల ఆగస్ట్ 31ననే (శనివారం) లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ల పంపిణీ చేయాలనీ, అలాగే ఏదేని కారణాల వలన మిగిలిపోయిన వారికి సెప్టెంబర్ 2న మాత్రమే పెన్షన్ల పంపిణీ చేయాలని, పెన్షన్ల పంపిణీ ఉదయం 6గం. ల నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించాలని, ఆలస్యం అయితే తప్పకుండా చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

గురువారం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ ఛాంబర్ నందు అన్ని మండలాల ఎంపిడిఓ లు, మునిసిపల్ కమిషనర్లతో సచివాలయాల సిబ్బందితో వర్చువల్ విధానంలో సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు దినం ఉన్నందున గౌ. ముఖ్యమంత్రి గారు సదరు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను ఒక రోజు ముందుగానే సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్ లబ్ధిదారులకు ఈ ఆగస్ట్ నెల 31ననే (శనివారం) పంపిణీ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని సచివాలయాల్లో సిబ్బంది రేపు శుక్రవారం రోజున బ్యాంకుల నుండి పెన్షన్ డబ్బులు డ్రా చేసి సిద్ధంగా అందుబాటులో ఉండేలా భద్ర పరచి ఆగస్ట్ 31న శనివారం ఉదయం 6గం. లకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని, ఒక్క నిమిషం లేట్ అయిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఏదేని కారణంగా మిగిలిపోయిన వారికి సెప్టెంబర్ 2వ తేదీన మాత్రమే పంపిణి చేస్తారని తెలిపారు.పెన్షన్ లబ్ధిదారులు అందరూ ఆగష్టు 31 వ తేదీనే పెన్షన్ తీసుకోనవలెనని, బయట గ్రామాలకు వెళ్ళినవారు కూడా ఆగష్టు 30 ననే చేరుకుని గ్రామాలలో వుండి శనివారం పెన్షన్ తీసుకొనవలెనని, సంబంధిత మండల, సచివాలయం అధికారులు వారికి సమాచారం అందించి అందరూ వచ్చేలా వారికి సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పెన్షన్ లబ్దిదారులు ఎవ్వరు సచివాలయ కార్యాలయానికి రావలసిన అవసరం లేదు అని తిరుపతి జిల్లా కలెక్టర్ వారు తెలిపారు.

గతంలో ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ చేసిన వారిని గట్టిగా హెచ్చరించి సక్రమంగా ఆగస్ట్ 31న ఉదయం 6 గం.లకే పెన్షన్ల పంపిణీ ప్రారంభించి అదే రోజు వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. సంబంధిత ఎంపిడిఓ లు, మునిసిపల్ కమిషనర్లు సదరు పెన్షన్లు సక్రమంగా పంపిణీ చేసేలా పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ నుండి జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారిణి సుశీల దేవి, జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ పథక సంచాలకులు ప్రభావతి, ఎల్డిఎం విశ్వనాథ రెడ్డి పాల్గొనగా వర్చువల్ గా ఎంపిడిఓ లు, మునిసిపల్ కమిషనర్ లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *