Breaking News

రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన సంయుక్త వ్యవసాయ సంచాలకులు మరియు e-పంట నోడల్ అధికారిణి విజయ భారతి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి గురువారం వ్యవసాయ కమీషనరు వారి కార్యాలయం నుండి సంయుక్త వ్యవసాయ సంచాలకులు మరియు e-పంట నోడల్ అధికారి విజయ భారతి  రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లి రైతు సేవా కేంద్రం తనిఖీ చేశారు. తనిఖీ లో భాగంగా మండలం లోని రైతు సేవా కేంద్రాల సిబ్బంది అందర్నీ కలిసి e- పంట యాప్ లో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల నమోదు చేసే విధానాన్ని పరిశీలించారు మరియు e- పంట నమోదులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వరి పంట లో e-పంట ను ఏ విధంగా చేస్తున్నారో పరిశీలించి తగిన సూచనలు చేశారు. వాస్తవ సాగుదారుల వివరాలు మాత్రమే నమోదు చేయాలని మరియు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ల నీటి పారుదల పద్ధతులను, ప్రకృతి వ్యసాయం మరియు సేంద్రియ వ్యసాయం చేస్తున్న రైతుల వివరాలను తప్పక e- పంట యాప్ లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారిణి స్రవంతి, జిల్లా సాంకేతిక వ్యవసాయ అధికారిణి హరిత, పుత్తూరు డివిజన్ సాంకేతిక వ్యవసాయ అధికారిణి హరిత కుమారి మరియు రామచంద్రాపురం మండల రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *