రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సుధీర్ఘ కాలం విధులను సమర్ధ వంతంగా నిర్వహించి నేడూ పదవీ విరమణ చేయుచున్న సీనియర్ అసిస్టెంట్ పుల్లమాంబ సేవలు అందించే క్రమంలో చూపిన పనితీరు అభినందనీయం అని జిల్లా సమాచార పౌర సంబంధాలు అధికారి సీహెచ్. శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీపీఆర్వో ఐ. కాశయ్య, డివిజనల్ పిఆర్వో ఎమ్. లక్ష్మణా చార్యులు,సహాయ సమాచార కార్యనిర్వాహాక ఇంజినీర్ ఎన్. వెంకటేశ్వర్లు తదితరులు అభినందనలు తెలియజేశారు.
తూర్పు గోదావరి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ లో 37 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కాలం టైపిస్ట్ గా , సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన నేతల పుల్లమాంబ 31.8.2024 పదవీ కార్యక్రమం స్ధానిక ఆనం కళాకేంద్రం సర్వరాయ వేదిక పై ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా పుల్లమాంబ , శ్రీనివాస శర్మ దంపతులను ఘనంగా సత్కరించడం జరిగింది. 1987 లో టైపిస్టు గా కొవ్వూరు డివిజనల్ పి ఆర్వో కార్యాలయంలో పనిచేసి, నరసాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం లలో పని చేసే నేడు పదవీ విరమణ చెయ్యడం జరిగిందన్నారు. పదవీ విరమణ సందర్భంగా సన్మానం చేసిన తోటి ఉద్యోగులకు, స్నేహితులు, బందు మిత్రులకు ఎన్.పుల్లామాంబ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియ చేసి సన్మానం చేసిన వారిలో సహాయ ఇంజనీర్ కె. శాంతి కుమారి , లైబ్రేరియన్ వి. శేఖర్, టైపిస్టు సీహెచ్. రామకృష్ణా, ఈ సురేష్, జూనియర్ అసిస్టెంట్ కే సోమ శేఖర్, సిబ్బంది పి. వేంకటేశ్వర రావు, రమణ, జానీ, తదితరులు పాల్గొన్నారు.