5 కె రెడ్ రన్ మారికాంక్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వైద్యఆరోగ్య శాఖ , జిల్లా ఎయిడ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నియంత్రణలో భాగంగా అవగాహన కల్పిస్తూ 5 కె రెడ్ రన్ మారికాంక్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టి. బి తిరుపతి అధికారి డాక్టర్ ఓ. శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ 5 కె రెడ్ రన్ మారథాన్ ఉదయం 6 గంటల నుండి భారతీయ విద్యాభవన్ అలిపిరిరోడ్ నుంచి టాటా కాన్సర్ ఆసుపత్రి వరకు మరియు తిరిగి భారతీయ విద్యాభవన్, అలిపిరి రోడ్ వరకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం 17 నుండి 25 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు పురుషులు, స్త్రీలు ట్రాన్సజండర్స్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. విజేతలకు మొదటి బహుమతి రూ. 7000 /- రెండవ బహుమతి రూ. 4000 /- పురుషులకి, స్త్రీలకి, ట్రాన్సజాండర్లకు ఇవ్వడం జరుగుతుంది కార్యక్రమంచి PASS స్వచ్చంధ సంస్థ సిబ్బంది. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది మరియు డాక్టర్ల, ఆశ వర్కర్లు పాల్గొనడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *