Breaking News

వర్షాలు తగ్గిన తదుపరి పూర్తి స్దాయిలో ఇసుక సరఫరా

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
-రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక 15,03,603 మెట్రిక్ టన్నులు
-భారీ వర్షాల కారణంగా ఇసుక సరఫరాలో అంతరాయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదనీటి కారణంగా ఇసుక సరఫరాలో నెలకొన్న అంతరాయాన్ని అతి త్వరలో పునరుద్దరిస్తామని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి, ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వివిధ రీచ్ ల నుండి సరఫరా నిలిచిపోయిందని, వర్షాలు తగ్గుముఖం పట్టి, రవాణా పరిస్ధితులు మెరుగైన తురువాత పూర్తి స్ధాయిలో ఇసుక సరఫరా కొనసాగుతుందన్నారు. సోమవారం నాటికి 39 ఇసుక నిల్వ కేంద్రాలలో 15,03,603 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు. అదివారం 7,305 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా 566 ధరఖాస్తులు అందాయన్నారు. వీరిలో ఐదుగురు మినహా, 561 ధరఖాస్తుదారులకు 7,275 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసామన్నారు. పలు చోట్ల రహదారులు దెబ్బతిన్న పరిస్ధితిలో వినియోగదారులు తమవంతు సహకారం అందించాలని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *