సెప్టెంబర్ 2వ తేది (నేడు) జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ 2వ తేది (నేడు) సోమవారం తిరుపతి జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కళాశాలల కు ఎయిడెడ్ యాజమాన్యాల కింద నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలకు జూనియర్ కళాశాలలకు ప్రభుత్వ శెలవు దినముగా ప్రకటిస్తూ, ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలన్నీ విధిగా పాటించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *