– జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి ఆదివారం జరిగిన యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడెమీ & నావల్ అకాడెమీ మరియు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2024 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారము ఉదయం 10 నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం 2.00 నుండి 4:30 గంటల వరకు రెండు సెషన్ల లో యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడెమీ & నావల్ అకాడెమీ పరీక్ష నిర్వహణ జరిగిందనీ, తిరుపతిలో నిర్వహించిన 2 పరీక్షా కేంద్రాల లో ఈ పరీక్షలకు 495 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఉదయం పేపర్ 1 పరీక్షకు 248 మంది 50.10శాతంగా, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షకు 255 మంది 51.52 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.
అలాగే యుపిఎస్సి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2024 పరీక్షలు ఉదయం 9 నుండి 11 గంటల వరకు, మద్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు , మద్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు మూడు సెషన్లలో జరిగాయని ఈ పరీక్షలకు మొత్తం 326 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా మొదటి సెషన్లో 132 మంది 40.49 శతం, రెండవ సెషన్లో 132 మంది 40.49 శతం, మూడవ సెషన్లో 75 మంది 41.44 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు.
పరీక్ష పత్రాలను స్ట్రాంగ్ రూమ్ నుండి బందోబస్తు నడుమ సంబంధిత పరీక్ష కేంద్రాలకు తరలించడం జరిగిందని, అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని అన్నారు. ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని తెలిపారు. కేంద్ర యుపిఎస్సి నిబంధనల మేరకు అన్ని విధాల పకడ్బందీ చర్యలు చేపట్టి పరీక్షలు నిర్వహించామని, అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
Prajavartha Online Telugu News