స్వచ్ఛత హి సేవలో అందరూ పాల్గొనండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛత హి సేవలో ప్రజలందరూ పాల్గొనాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నగర పౌరులందరికీ పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో, సెప్టెంబర్ 17, 2024 మంగళవారం నాడు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం ప్రారంభోత్సవానికి కావలసిన ఏర్పాట్లను అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గాంధీ గారి ఆశయంగా స్వచ్ఛ భారత్ మిషన్ గా 2014 లో మొదలైన స్వచ్ఛభారత్ 2024 కి పది సంవత్సరాల పూర్తయ్య శుభ సందర్భంగా, ఈ సంవత్సరం జరిగే స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలోని నగర పౌరులు, విద్యార్థులు, అందరూ పాల్గొనాలని స్వచ్ఛ విజయవాడలో భాగస్వాములు కావాలని అన్నారు. మంగళవారం ఉదయం స్వచ్ఛత హి సేవ ప్రారంభోత్సవ కార్యక్రమం మాకు నేని బసవపూర్ణయ్య స్టేడియంలో ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు మొదలవుతుందని ప్రజలందరూ వచ్చి ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని, జయప్రదం చేయాలని కోరారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) కే.వి. సత్యవతి, డిప్యూటీ సిటీ ప్లానర్ జూబిన్ చీరన్ రాయ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *