Breaking News

ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రాంతాలలో సత్వరమే పారిశుధ్య నిర్వహణ పూర్తిచేసి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులతో అన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం కండ్రిక, ఉడా కాలనీ, రాజీవ్ నగర్, నున్న, ముస్తాబాద్, తదితర ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తన పర్యటనలో గమనించిన పేరుకుపోయిన వ్యర్థాలను చూసి అక్కడున్న శానిటరీ ఇన్స్పెక్టర్ ని మందలించి, దగ్గరుండి వ్యర్ధాలను తీసేలా చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ రామకోటేశ్వరావుతో అన్నారు. తదుపరి రాజీవ్ గాంధీ స్కూల్ లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు, స్కూల్లో చేయాల్సిన పారిశుద్ధ్య నిర్వహణ సత్వారమే పూర్తిచేసి , ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ఎక్కడైతే స్కూళ్లు, ఆస్పత్రులు ఉన్నాయో అక్కడ వెంటనే పారిశుద్ధ్య నిర్వహణ సత్వరంగా పూర్తి చేసి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *