-ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం
-మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని టిడిపి మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ అన్నారు. రాష్ట్రంలో టిడిపి ఆధ్వర్యంలోని జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా విజయవాడ రాజరాజేశ్వరి పేటలో ఆదివారం పర్యటించారు. ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వందరోజుల పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షోభంలోనూ సంక్షేమం అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవంతమయ్యారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శలు మానుకొని ప్రజలకు సేవ చేయాలన్నారు. వరదల సమయంలో వైసీపీ నాయకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ ముందుకెళ్తున్నామన్నారు.వరద విపత్తు సమయంలో కూటమి నేతలు మాత్రమే బాధితులకు అండగా నిలబడ్డారన్నారు. పశ్చిమ శాసనసభ్యులు సుజన చౌదరి బాధితులకు నిరంతరం అందుబాటులో ఉంటూ చేసిన సేవలు వెలకట్ట లేనివని కొనియాడారు.వంద రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ పాలనలో వెయ్యి రోజులు ముందడుగు వేసామన్నారు.పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, బిజెపి పై సానుకూలత, చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం ఏర్పడడంతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అనూహ్యమైన విజయాన్ని ఇచ్చారన్నారు. రాజధాని అమరావతి మొదలు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జలీల్ ఖాన్ తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు నున్నా కృష్ణ, రౌతు వాసు, ఆది, పులి చేరి రమేష్, వాసు, గాయత్రి ,వసుంధర, నజియా, మల్లెపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News