విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో 39 వ డివిజన్ పరిధిలోని గుప్తా సెంటర్ ప్రాంతంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కొయ్యాన అప్పారావు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. నిరుపేద కార్యకర్త అయినటువంటి కొయ్యాన అప్పారావు దురదృష్టవశాత్తు అనారోగ్యంతో మరణించాడని వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని 39 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు రేగళ్ల లక్ష్మణరావు ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది సోమవారం ఆర్థిక సాయంతో పాటుగా 25 కేజీల బియ్యం కూడా వారి కుటుంబానికి అందించారు. కార్యకర్తలకు ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఎమ్మెల్యే సుజనాకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News