Breaking News

పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పెషల్ సమ్మర్ రివిజన్ -2025 లో భాగంగా జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ జాగ్రత్తగా చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని విడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్పెషల్ సమ్మర్ రివిజన్ 2025 పై ఈ ఆర్ ఓ లు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని తెలిపారు. ఈ ప్రక్రియ పై సంబంధిత ఈ ఆర్ ఓ లు, తహసీల్దార్లు, బిఎల్వోలు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. పోలింగ్ బూత్ల రేషనులైజేషన్ ప్రక్రియను ఓటర్ల ప్రాతపదికన,ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ చేసిన హ్యాండ్ బుక్ లో పొందుపరచిన విధంగా రేషనల్లైజేషన్ ప్రకారం పక్కగా చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్వో పెంచల కిషోర్, సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి, శ్రీకాళహస్తి ఈఆర్ఓ రవిశంకర్ రెడ్డి, సత్యవేడు ఈఆర్ఓ రామ్మోహన్, వెంకటగిరి ఈఆర్ఓ నరసింహులు, ఎలక్షన్ సూపరింటెండెంట్ ప్రసాద్, తహసీల్దార్లు, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *