అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పారిస్ ఒలింపిక్స్ లో మన దేశానికి మరో పతకం అందించిన షూటర్లు సరబ్ జోత్ సింగ్, మను బాకర్ లకు అభినందనలు. 10 మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో కాంస్యం సాధించడం సంతోషదాయకం. మన దేశం నుంచి ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్ గా మను బాకర్ రికార్డు సాధించి క్రీడాభిమానులకు ఉత్తేజాన్నిచ్చారని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Read More »Tag Archives: AMARAVARTHI
వన్యప్రాణులను అక్రమ రవాణా చేసినా… అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేసినా కఠిన చర్యలు
-అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -విజయపురి సౌత్ రేంజ్ అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనపై పల్నాడు కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వన్య ప్రాణులను, జంతువులను వేటాడి, అక్రమ రవాణా చేసేవారిపై ఉపేక్షించవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్య ప్రాణి అలుగు …
Read More »ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియచేసి జ్ఞాపిక అందచేశారు. మంగళవారం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ గారినీ, ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ …
Read More »పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయండి
-టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు -పులుల వేట… స్మగ్లింగ్ పై కఠినంగా వ్యవహరిస్తాం -పులులను కాపాడితే… అవే అడవులను రక్షిస్తాయి… పచ్చదనం పెరిగితే పర్యావరణ సమతౌల్యం ఉంటుంది – ‘మన్ కీ బాత్’లో నల్లమలలో టైగర్ ట్రాకర్స్ గా చెంచుల గురించి ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించడం సంతోషకరం -వసుధైక కుటుంబంలో వన్య ప్రాణులూ భాగమే -అటవీ శాఖలో ఉద్యోగుల కొరత, సమస్యల పరిష్కారానికి చర్యలు -అంతర్జాతీయ పులుల దినోత్సవం కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, …
Read More »సమస్యలు వింటూ… పరిష్కారం దిశగా…
-బాధితుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యలు తెలుసుకునేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. సమస్యలు చెప్పుకొనేందుకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాధితులను స్వయంగా కలిసి వారి బాధలు విన్నారు. సోమవారం సాయంత్రం కేంద్ర కార్యాలయం ముందు వినతి పత్రాలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. వైసీపీ నాయకుల కబ్జాలు, గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ఒప్పంద ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు తమకు …
Read More »క్యాన్సర్ స్క్రీనింగ్‌కు సర్వసన్నద్ధం కావాలి
-ఇంటింటికీ కరపత్రాల్ని పంపిణీ చేయాలి -ప్రజల్లో అవగాహన కల్పించాలి -ప్రజల్లో మానసిక సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి -ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని(NCD CD 3.O) రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు15 నుండి ప్రారంభించనున్నందున అందుకు సర్వసన్నద్ధం కావాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ స్పష్టం చేశారు. మంగళగిరి ఎపిఐఐసి టవర్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుండి సోమవారం ఆయన అసంక్రమిక …
Read More »మదనపల్లి ఫైళ్ళ దహనం సంఘటనలో ఎంతటివారున్నావదిలిపెట్టేది లేదు
-ఇప్పటికే ఇద్దరు ఆర్డీఓలు,సీనియర్ అసిస్టెంట్ సస్పెన్సన్ -త్వరలో రాజముద్ర,క్యుఆర్ కోడ్ తో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ -భూములు భూములు అన్యాక్రాంతం కాకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చే ఆలోచన -ఉమ్మడి చిత్తూరు,నెల్లూరు,ఒంగోలు జిల్లాల్లో రెవెన్యూ ఉన్నతాధికారుల పర్యటనలు -జగన్ బొమ్మ ఉన్నసర్వే రాళ్ళకు 650 కోట్లు,పాస్ పుస్తకాలకు 13 కోట్లు వృధా చేశారు -7వేల గ్రామాల్లో జరిగిన భూముల రీసర్వేను గ్రామ సభల ద్వారా పున:పరిశీలన చేస్తాం -సియం ఆదేశాల ప్రకారం రెవెన్యూ శాఖలో ప్రక్షాళనకు త్వరలో శ్రీకారం -రాష్ట్ర …
Read More »రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ 2029 కల్లా గృహాలు
-వంద రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాల లక్ష్యం -కేంద్ర పథకాల ఆసరాతో మద్యతరగతి, దిగువ మద్య తరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇళ్ల నిర్మాణం -ఇకపై కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని నిర్ణయం -రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ 2029 కల్లా శాశ్వత గృహ వసతిని కల్పించాలనే …
Read More »సెర్ప్ నిర్వహిస్తున్న కార్యక్రమాల పై పూర్తి స్థాయి సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : SERP, MSME మరియు NRI వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాసు అధ్యక్షతన, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (SERP) ముఖ్య కార్యదర్శి జి. వీర పాండ్యన్ ఆధ్వర్యంలో, సోమవారం గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (SERP) ప్రధాన కార్యాలయం లో సెర్ప్ నిర్వహిస్తున్న కార్యక్రమాల పై పూర్తి స్థాయి సమీక్షా చేయడం జరిగింది. ఈ సమీక్షా లో భాగంగా SERP నిర్మాణం, సిబ్భంది, స్వయం సహాయక సంఘాలు స్థాయిలో చేపడుతున్న వివిధ జీవనోపాధుల మరియు పించన్ల …
Read More »పట్టాదారు పాసుపుస్తకంపై రాజముద్ర పునరుద్ధరణపై మంత్రి గొట్టిపాటి హర్షం
-రైతుల పాసుపుస్తకాలపై జగన్ ఫోటో పెట్టుకోవడం ప్రచార పిచ్చికి పరాకాష్ట అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయంపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి పట్టాదారు పాసుపుస్తకం పై రాజముద్ర వేసి ఇస్తామని చెప్పిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు. దేశంలో ఎప్పుడూ, …
Read More »