Breaking News

Tag Archives: machilipatnam

ఉచిత ఇసుక సరఫరాకు చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని వినియోగదారులకు ఉచిత ఇసుకను అందించేందుకు టెండర్ ప్రక్రియ ద్వారా ఏజెన్సీని గుర్తించి ఖరారు చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం ఉదయం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రీచ్ లలో ఇసుక తవ్వి వాహనముల ద్వారా సమీపంలోని స్టాక్ యార్డులకు చేర్చడం, రవాణా నిమిత్తం ర్యాంపుల నిర్మాణం, అప్రోచ్ …

Read More »

మత్స్యకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత… : మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సముద్రంలో వేట సాగించే మత్స్యకారుల భద్రత ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు కలిగిన 50 మంది మత్స్యకారులకు ఆదివారం సాయంత్రం నగరంలోని మంత్రి నివాసం వద్ద ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సముద్రంలో వేట సాగించే మత్స్యకారుల భద్రత కోసం కమ్యూనికేషన్ వ్యవస్థ కలిగిన ట్రాన్స్ఫాండర్లను మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు కలిగిన యజమానులకు అందిస్తున్నామని, రాబోయే …

Read More »

ఈ నెల 7వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) నిర్వహిస్తాం

-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 7 వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక …

Read More »

జిల్లాలో ఈ- క్రాప్ నూరు శాతం నమోదు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ శనివారం గూడూరు మండలం రామరాజుపాలెం గ్రామ పరిధిలో వ్యవసాయ శాఖ సిబ్బంది నమోదు చేసిన ఈ- క్రాప్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. రామరాజుపాలెం గ్రామానికి చెందిన రైతు డొక్కు శివ శంకర వెంకటకృష్ణ లక్ష్మీ వరప్రసాద్ పొలంలో సాగు చేస్తున్న వరి పంట కలెక్టర్ పరిశీలించి, ఈ క్రాప్ యాప్ లో రైతు వివరాలు సర్వేనెంబర్ 9/3, ఖాతా నెంబర్ 89, ఎం టి యు 1262 వరి రకం య.1.10 విస్తీర్ణం తదితర …

Read More »

జూన్ మాసాంతానికి కొత్త సమగ్ర విమానాశ్రయ టెర్మినల్ భవనం పూర్తవుతుంది…

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే సంవత్సరం జూన్ మాసాంతానికి కొత్త సమగ్ర విమానాశ్రయ టెర్మినల్ భవనం పూర్తవుతుందని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు విమానాశ్రయ సలహా కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. శనివారం ఉదయం గన్నవరం-విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని సమావేశ మందిరంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు అధ్యక్షతన కమిటీ కో చైర్మన్ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, కృష్ణ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలిసి విమానాశ్రయ సలహా కమిటీ సమావేశం నిర్వహించి విమానాశ్రయ విస్తరణ పనులు, …

Read More »

స్వచ్ఛ మచిలీపట్నం గా తీర్చిదిద్దడంలో ప్రభుత్వానికి సహకరించాలి…

మచిలీపట్నం,నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి, నగరంలో డంపింగ్ యార్డ్ సమస్య, స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ సిస్టం ఏర్పాటు గురించి సమీక్షించారు. భారీ వర్షాలు తుఫాను సందర్భాల్లో నగరంలో పలు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీని నివారణకు నగరంలో నాలుగు చోట్ల పంపు హౌసులు (డ్రెయిన్ వాటర్ లిఫ్టింగ్) ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి …

Read More »

తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసి ఇచ్చేలా నగర ప్రజలను చైతన్య పరచాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 5 వ తేదీ నుండి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసి ఇచ్చేలా నగర ప్రజలను చైతన్య పరచాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. గురువారం సాయంత్రం నగరంలోని నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మున్సిపల్ అధికారులు సిబ్బందితో చెత్త నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల నాలుగో తేదీన శుక్రవారం ఉదయమే నగరంలోని ప్రతి ఇంటికి పోయి చెత్తను …

Read More »

బందరు పోర్టు ప్రారంభించుటకు ప్రభుత్వం అన్ని చర్యలు

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : 2025 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి బందరు పోర్టు ప్రారంభించుటకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి గురువారం తమ నివాసంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో పర్యటించి స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించడం, డంపింగ్ యార్డ్ సందర్శించి అక్కడ పరిస్థితిని పరిశీలించడం, అదేవిధంగా బందరు పోర్టు ఆకస్మికంగా సందర్శించి పనులు …

Read More »

నగర సుందరీకరణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగర సుందరీకరణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి ఛాంబర్లో మునిసిపల్ అధికారులు, ముడా అధికారులతో కలిసి మచిలీపట్నం అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముడా పరిధిలోని పోర్టు డంప్యార్డు లేఔట్లు ఉన్న రేఖా చిత్రపటాన్ని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి డివైడర్ లపై వివిధ కళాకృతులతో …

Read More »

జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా స్థాయి క్రీడల అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలోని గ్రామపంచాయతీలు మున్సిపాలిటీల ద్వారా మూడు శాతం స్పోర్ట్స్ సెస్ వసూళ్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీని ఆర్థికంగా పటిష్టం చేసేందుకు జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల నుండి జీవో నెంబర్ 84 ద్వారా 3 …

Read More »