Breaking News

ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర రవాణా రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు

మచిలీపట్నం (గిలకలదిండి), నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా రహదారులు భవనాల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు శనివారం మధ్యాహ్నం గిలకలదిండిలో రూపుదిద్దుకుంటున్న ఫిషింగ్ హార్బర్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.

ఏపీ మారిటైం బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్యతో కలిసి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ ప్రణాళికకు సంబంధించిన మ్యాపులను పరిశీలించి డ్రెడ్జింగ్, బ్రేక్ వాటర్, భవన నిర్మాణాలు, టెట్రాపాడ్స్ దిమ్మల ఏర్పాటు తదితర పనుల పురోగతి వివరాలను ఆయన సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆశించిన రీతిలో పనులు ముందుకు సాగడం లేదని, దీనితో పురోగతి మందగించిందని పేర్కొంటూ, పనులను వేగవంతం చేసి నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ నెలాఖరికి పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోతే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ టీం లీడర్ చేతన్, ఏపీ మారిటైం బోర్డు సీఈ రాఘవరావు, ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వరులు, మచిలీపట్నం దక్షిణ మండల తహసిల్దార్ మధుసూదన్ రావు తదితరులు ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వెంట ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *