Breaking News

2025 జాతీయ స్థాయిలో జరిగిన ప్రిజన్ హైజీన్ లో మూడో స్థానం

-రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం కాంస్య పతకం
-ఎస్ రాహుల్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని అప్పాలో ఇటీవల నిర్వహించిన 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్–2025లో జాతీయ స్థాయిలో జరిగిన ప్రిజన్ హైజీన్ పోటీలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి కాంస్య పతకం సాధించిందనీ కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ స్వీకరించామన్నారు. జైళ్లలో పరిశుభ్రత, ఆరోగ్యకర వాతావరణం కల్పించడంలో కేంద్ర కారాగారం, రాజమహేంద్రవరం సాధించిన ఈ విజయాన్ని సిబ్బంది సమష్టి కృషినీ రాష్ట్ర జైళ్ల శాఖ ఉన్నతాధికారులు అభినందించారనీ తెలిపారు. ఈ పురస్కారంతో రాష్ట్ర జైళ్ల శాఖకు గౌరవం చేకూరిందని కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *