Breaking News

Tag Archives: rajamendri

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రబీ సాగుకు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు అర్భికే లలో కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించే వాలంటీర్లు అవార్డ్ జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలసి గురువారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రైతుల నుంచి ధాన్యం సేకరణ చేపట్టే ముందు ఈ-క్రాప్ లో తప్పనిసరిగా రైతులచే నమోదు చేయాలన్నారు. రైతులు …

Read More »

ముఖ్య అతిధులు మీరే.. వాలంటీర్ల సన్మాన సభలో కలెక్టర్

-కోవిడ్ సంక్షోభ సమయంలో మీ సేవలు నిరూపమానం… డా. మాధవీలత నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అందచేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో వాలంటీర్లు సేవలు నిరూపమానం అని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత పేర్కొన్నారు. గురువారం నల్లజర్ల లో గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన వాలంటీర్లు జ్యోతి ఫంక్షన్ హాల్లో జరిగిన అవార్డు ప్రథానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో …

Read More »

దిగుబడి, ఆదాయ వనరులు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వొచ్చే సమావేశం నాటికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రస్తుత దిగుబడి, ఆదాయ వనరులు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మత్స్య, ఉద్యాన అనుబంధం, మార్కెటింగ్ సెరి కల్చర్, శాఖల జిల్లా డివిజన్ స్థాయి అధికారులతో ప్రాథమిక రంగం పై జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలసి బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కె. …

Read More »

మండల స్థాయి అధికారులలో సమన్వయం లోపం లేకుండా పనులు వేగవంతం కోసం చర్యలు తీసుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, మండల స్థాయి అధికారులలో సమన్వయం లోపం లేకుండా పనులు వేగవంతం కోసం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత పేర్కొన్నారు. స్పందన ఫిర్యాదులు ఎస్ ఎల్ ఏ పరిధిలోనే ఉండాలని, 24 గంటల్లో పరిష్కారించాలన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో డివిజన్ , మండల స్థాయి అధికారులతో హౌసింగ్, ఓటీఎస్, స్పందన తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలసి బుధవారం …

Read More »

జిల్లా జడ్జి జస్టిస్ ఎమ్. బబిత ని మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్ డా.కె. మాధవీలత…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన డా.కె. మాధవీలత బుధవారం జిల్లా జడ్జి జస్టిస్ ఎమ్. బబిత ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. జెడ్జ్ ని కలిసిన వారిలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన జస్టిస్ ఎమ్. బబిత మాట్లాడుతూ, జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.  

Read More »

ప్రజా సమస్యల, విజ్ఞప్తుల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచెయ్యాలి…

రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ సిబ్బంది ప్రజా సమస్యల, విజ్ఞప్తుల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచెయ్యలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత పేర్కొన్నారు. ధవలేశ్వరం లోని 2 వ గ్రామ సచివాలయన్నీ కలెక్టర్ బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై సచివాలయ ఉద్యోగులు స్పందించి పరిష్కారం చూపాల్సి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మంచి ఆలోచన తో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. …

Read More »

సచివాలయ కార్యదర్సులు, వాలంటీర్లు ప్రభుత్వ పధకాలను అర్హులైన లబ్ధిదారులకు అందచేయ్యడం లో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించాలి…

కొరికొండ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ కార్యదర్సులు, వాలంటీర్లు ప్రభుత్వ పధకాలను అర్హులైన లబ్ధిదారులకు అందచేయ్యడం లో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం కోరుకొండ మండలం బురుగుపూడి సచివాలయం, దోసకాయపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మంచి ఆలోచన తో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పరిష్కార దిశగా ఒక ప్రత్యేక వ్యవస్థ …

Read More »

బాబు జగజ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎనలేని సేవలు అందించారు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల సందర్భంగా ఆయనను స్మరించుకోవడం మన కర్తవ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే.మాధవీలత అన్నారు. మంగళవారం స్థానిక జాంపేటలో గల చర్చిపేట నందు భారత దేశ మాజీ ఉపప్రదాని బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి డాక్టర్ మాధవి లత.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా …

Read More »

జిల్లా ను అభివృద్ధి పథంలో నడిపించే సంసిద్ధులు కండి

-విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తే సహించేది లేదు.. -ప్రతి ఒక్కరూ సమాచారం తో పాటు సమన్వయం తో సమర్ధవంతంగా పనిచెయ్యాలి -కలెక్టర్ డా.కె. మాధవీలత రాజమహేంద్రవరం(రూరల్), నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో పరిపాలన యంత్రాంగం సమన్వయం తో సమర్థవంతంగా పనిచేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తూర్పుగోదావరి జిల్లా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, సోమవారం 4వ తేదీ …

Read More »

సాంస్కృతిక ప్రదర్శనలు, హస్తకళలు, వంటకాలు, సాహిత్య కార్యక్రమాలతో చిరస్మరణీయమైన రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : మెగా రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022 మొదటి దశ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో ముగిసింది. సాంస్కృతిక ప్రదర్శనలు, హస్తకళలు, వంటకాలు, సాహిత్య కార్యక్రమాలతో చిరస్మరణీయమైన రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం. సాంస్కృతిక ప్రదర్శనలు, హస్తకళలు, వంటకాలు సాహిత్య కార్యక్రమాలు చిరస్మరణీయమైన రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవాన్ని అందించిన సాంస్కృతిక ప్రదర్శనలు, హస్తకళలు, వంటకాలు, సాహిత్య కార్యక్రమాలతో కనులవిందుగా సాగిన రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఫెస్టివల్ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022 మొదటి …

Read More »