-రీసర్వే పనుల పురోగతి పై అధికారులతో సమీక్షించిన…
-జిల్లా కలెక్టరు డా. కె.మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం ద్వారా జిల్లా పరిధిలో జరుగుతున్న పనుల పురోగతి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు కె.మాధవీలత అధికారులు ను ఆదేశించారు. మంగళవారం న్యాక్(ఏ.ఎం.సి) కలెక్టరేట్ సమావేశమందిరం వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం ద్వారా చేపట్టిన రీసర్వే అంశాలకు సంబందించి పనుల పురోగతిపై కలెక్టర్ కె.మాధవిలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ లు సమీక్షించారు. ఈసందర్బంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం ద్వారా గ్రామాల్లో రీసర్వే పనులను పురోగతిని వేగవంతం చేయాలన్నారు. పనుల పురోగతి లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసి ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 20 గ్రామంలో పూర్తి రీ సర్వే గ్రౌండ్ వాల్యూషన్, నోటిఫికేషన్ పనుల ప్రక్రియ పూర్తయ్యి దన్నారు. మరో 41 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేశామని మాధవీ లత పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరిస్తూ రీసర్వే ప్రక్రియ జరుగుతున్నదీ లేనిది సర్వే అధికారులు నుంచి సమాచారాన్ని తెలుసుకోవడం జరిగిందన్నారు. ఏఒక్కరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా రైతుల భూముల సరిహద్దులు విషయంలో ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని కమీషనర్ తెలిపారు. రీ సర్వే చేయడం తో పాటు భూముల సరిహద్దులు తెలిపే విదంగా సర్వే రాళ్లు కూడా ఆయా భూముల్లో పాతుతున్నారని చెప్పారు . ఇటువంటి మహాయజ్ఞలో రెవిన్యూతో పాటు పంచాయితీ వంటి అనేక శాఖల అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ భూములు గల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి భూముల రీసర్వే చేస్తూ రికార్డులు భద్రం చేయడం జరుగు తుందన్నారు. వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో డ్రోన్ ద్వారా రీసర్వే చేసేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఈ సమావేశం లో ఆర్థివోలు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్ర వర్షిణి, తహసీల్దార్ లు, సర్వే, మునిసిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News