-కలెక్టర్ డా. కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా లోని పురపాలక, నగరపాలక పరిధిలో మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే స్థలాలు అందించేందుకు భూసేకరణ చెప్పట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవిన్యూ, పురపాక, నగరపాలక ఎం ఐ జి భూసేకరణ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, పట్టణ ప్రాంతల్లో నివశించే మధ్య తరగతి ప్రజలకు (ఎమ్ ఐ జి ) స్వంత ఇంటి నిర్మాణం కోసం స్థలాలు మున్సిపాలిటీ ల్లో ఏర్పాటు చేసే దిశలో కనీసం 25 నుంచి 50 ఎకరాలు స్థలాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయి లో సమగ్ర సర్వే చేపట్టాలన్నారు. గతంలో కేటాయించి, వినియోగం లో లేని రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ శాఖలకు, సంస్థ లకు, అనుబంధ కేంద్ర, రాష్ట్ర సంస్థ లకు ఇచ్చిన వాటి వివరాలు అందించాలన్నారు. అదేవిధంగా క్షేత్ర స్థాయి లో పట్టా భూములు వివరాలు కూడా సోమవారం నాటికీ రెవిన్యూ డివిజన్ అధికారులు తహసీల్దార్ల నుండి సమగ్ర నివేదిక రూపొందించి అంద చేయ్యాలన్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని యెడల రైతులతో మాట్లాడి భూసేకరణ చేపట్టాలని పేర్కొన్నారు. ఆయా భూములు సేకరణ కి సంబంధించి నగదు చెల్లింపులు చెయ్యడం జరుగుతుందని స్పష్టంగా తెలియ చేయ్యాలన్నారు. నవరత్నాలు కార్యక్రమం లో భాగంగా చేసినట్లు చెయ్యాల్సి ఉంటుందన్నారు. సర్వే చేపట్టి, భూ సేకరణ కి లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధ్యమైనంత త్వరగా భూ సర్వే, భూసేకరణ ఉండాలని, సోమవారం నాటికీ నివేదిక సమర్పించాలని ఆర్డివో లను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షణ చెయ్యాలని మాధవీలత తెలిపారు. భూముల మ్యూటేషన్ విషయం లో కాలయాపన లేకుండా తహసీల్దార్ లు చర్యలు చేపట్టాలని, జాప్యం లేకుండా చూడాలన్నారు. కొవ్వూరు, నిడదవోలు, రాజమహేంద్రవరం లలో లబ్ధిదారులు స్థలాలు కొరకు దరఖాస్తులు చేసుకున్నారన్నారని అధికారులు కలెక్టరు కు వివరించారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో లబ్ధిదారుల కోసం రాజానగరం, కడియం ప్రాంతాల్లో భూములు గుర్తించాలని సూచించారు. ఈ సమావేశం లో ఆర్థివోలు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్ర వర్షిణి, తహసీల్దార్ లు, మునిసిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News