రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతరత్న డా. బి ఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, ఎంపీ మార్గాని భరత్ రామ్ శుభాకాంక్షలు తెలియచేశారు. విద్యా యొక్క ప్రాముఖ్యత ను గుర్తించి రాజ్యాంగం లో ప్రాధాన్యత కల్పించడం ఆయన ముందుచూపుకు నిదర్శనమన్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపడం, భవిష్యత్ తరాలకు అందించడం మనం ఆయనకి అర్పించే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, ఎంపీ మార్గాని భరత్ రామ్ లు పేర్కొన్నారు. గురువారం మునిసిపల్ కార్యాలయ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, 1964 సంవత్సరంలో అంబేద్కర్ మహనీయుడు బస చేసిన ప్రాంతంలో మనం ఈరోజు అంబేద్కర్ జన్మదిన వేడుకల్లో మనం చేసుకున్న అదృష్టం అన్నారు. ఈ దేశంలో ఎన్నో కులాలు, మతాలు, వర్గాలు ఉన్నాయని, వాటినన్నింటిని సమన్వయము చేసుకుంటూ మంచి రాజ్యాంగం రూపొందించుకుంటే ప్రతి వర్గం అభివృద్ధి చెందుతుంది అని ఆలోచన చేసిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు.ఎన్నో చదువులు చదివి ఆరోజుల్లోనే ఎన్నో డిగ్రీ లు పొందిన అంబేద్కర్ విద్య యొక్క ప్రాముఖ్యత ను చేతల ద్వారా చాటి చెప్పడం జరిగిందన్నారు. ఆయన ముందుచూపు తో వివక్ష ను ఎలా రూపుమాపాలో మనకు రాజ్యాంగ రచన ద్వారా చాటిచెప్పారని, నేటి యువతరం వారు ఇచ్చిన సందేశాల నుంచి స్ఫూర్తి పొంది ఆచరణ లో చూపాలని విజ్ఞప్తి చేసారు.
పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ, దేశంలో వాడ వాడలా ఒక పండుగ వాతావరణం లో అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ట్లు పేర్కొన్నారు. రాజ్యాంగం రచించి 75 సంవత్సరాలు అయినా ఇప్పటికీ దానినే ప్రామాణికంగా ఆచరణ లో ఉందని, చెక్కు చెదరకుండా ఉండడం ఆయన ముందుచూపుకి నిదర్శనం అన్నారు. ప్రపంచం లోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించి నేటికీ ఆదర్శ వంతునిగా , అంబేద్కర్ ఆశయ సాధాన భవిష్యత్ తరాలకి అందించే భాద్యతలు నేటి యువత తీసుకోవాలని భరత్ కోరారు.
కమీషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, వారు నేర్పిన విలువలు భవిష్యత్ తరాలకు అందించే భాద్యతలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ప్రజాస్వామ్యం ఏర్పడినా, తదుపరి అవి వాటి ఉనికిని కోల్పోయిన ఘటన లు చూసామన్నారు. నేటికి అతి పెద్ద రాజ్యాంగ వ్యవస్థ ఉన్న భారత దేశంలో ప్రజాస్వామ్యం నిరంతరం గా కొనసాగుతోంది అంటే అందుకు కారణం అంబేద్కర్ ముందు చూపే కారణం అన్నారు.
కార్యక్రమానికి మునిసిపల్ కమీషనర్ కె.దినేష్ కుమార్, రూడా ఛైర్ పర్సన్ మేడపాటి షేర్మిళ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కుసుమ నాగ జ్యోతి, సత్యనారాయణ, ప్రసాద్, పలు ఎస్సి, ఎస్టీ తదితర సంఘల నాయకులు తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, నీలపు వెంకటేశ్వర రావు, చిన్నా వెంకట్రావు, రాజేశ్వరరావు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు జక్కంపూడి విజయలక్ష్మి, అధికారులు, పలు ఇతర బిసి సంఘాల నాయకులు, ప్రతినిధులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News