Breaking News

Tag Archives: rajamendri

ఎపి జెఏసి నాయకుల బృందం ఉద్యమ కార్యాచరణ

రాజమహేంద్రవరం , తేదీ: మార్చి 4 : శనివారం రాత్రి స్ధానిక కలెక్టరేట్ లో కలెక్టర్ ఛాంబర్ లో ఎపి జెఏసి నాయకుల బృందం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీ లత ను కలిసి తమ ఉద్యమ కార్యాచరణను వివరించి, సహకరించవలసినదిగా కోరడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి, వివిధ శాఖల అధికారులను కలిసి ఉద్యమ కార్యాచరణ వివరించి వారి సహకారాన్ని అందించవలసినదిగా కోరడమైనది. శనివారం నగరంలో, డివిజన్, మండల కేంద్రాలలో వివిధ శాఖల ఉద్యోగులను వారి కార్యాలయాలలో కలిసి కరపత్రాలు …

Read More »

‘రుడా’ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ దినోత్సవ వేడుకలు 

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) కార్యాలయంలో రుడా చైర్ పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిల రెడ్డి ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి మహిళాలు కోసం మాట్లాడుతూ ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. ముందుగా 1910 ఆగస్టులో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో జరిగిందని. 1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగివి అని మహిళలకు …

Read More »

“అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు”

కోరుకొండ/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా “అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు” ను పురస్కరించుకుని మార్చి 4 నుండి 11 వరకు నిర్వహించ బడుచున్న న్యాయ అవగాహన కార్యక్రమములలో భాగంగా శనివారం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించినారు. ఈ సదస్సులో మహిళలతో ప్రత్యూష కుమారి మాట్లాడుతూ …

Read More »

ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూహం పై దిశా నిర్దేశం

-మత్స్య శాఖ కమిషనర్ కలెక్టర్ లతో జూమ్ కాన్ఫరెన్స్ -జిల్లాలో నాన్ ఆక్వా జోన్ పరిధిలోని చెరువులను ఆక్వా జోన్ లోకి మార్పు -2వ పేజ్ లో ఆక్వా జోన్ కి కన్వర్షన్ చేసిన 229.09 ఎకరాలు -కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం పెంపొందించే దిశలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు  డిఎల్ఎస్ లో రెండు ఫేజ్ లో 106 మంది రైతులకు చెందిన 229.09 ఎకరాలను ఆక్వా జోన్ లోనికి మార్పు …

Read More »

ఉద్యోగమేళా…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ లో వికాస వారి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగమేళాలో 16 మంది నిరుద్యోగ యువత వివిధ కంపెనీల్లో ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని వికాస్ కేంద్రంలో ఇంటర్వూలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రతి శనివారం జిల్లా కలెక్టర్ లోని వికాస్ కేంద్రం లో బహుళజాతి, స్థానిక ప్రవేటు సంస్థల అధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూ లను నిర్వహించడం జరుగు తుందన్నారు. ఆసక్తి …

Read More »

లబ్ధిదారులు స్వచ్చందంగా ఇంటి నిర్మాణానికి చొరవ చూపాలి

-ఉగాది నాటికి రాష్ట్రంలో 5 లక్షల గృహాల గృహప్రవేశానికి సన్నాహాలు చేస్తున్నాం -ఇంటి నిర్మాణం పూర్తి చేసిన ప్రతి ఇంటికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్ -కలెక్టర్ కే. మాధవీలత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీల్లో లబ్దిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం ఉదయం చాగల్లు గ్రామంలో జగనన్న కాలనీ కొత్త లే అవుట్ లను కలెక్టర్ పరిశీలించి, లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడడం జరిగింది. …

Read More »

అనపర్తి ఏరియా ఆసుపత్రిలో 12 మంది జి ఎస్ ఎల్ మెడికల్ విద్యార్థుల ద్వారా వైద్య సేవలు

-జాతీయ ఆరోగ్య మిషన్ కింద 4,5,6 సెమిస్టర్ విద్యార్థులు హాజరు -డా సనత్ కుమారీ అనపర్తి/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందచేసే వైద్య సేవలు, ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఆసుపత్రులలో కలుగచేస్తున్న వైద్య సేవలపై మెడికో లకు అవగాహన సామాజిక చైతన్యం కల్పించడం జరుగుతున్నట్లు డి సి హెచ్ ఎస్ డా ఎమ్. సనత్ కుమారి పేర్కొన్నారు. శుక్రవారం జీ ఎస్ ఎల్ మెడికల్ కాలేజీ కి చెందిన తొలి బ్యాచ్ విద్యార్థులు అనపర్తి ఏరియా ఆసుపత్రి …

Read More »

పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జిల్లాలో పర్యటన

-ప్రతి రోజు ఈ రోజు కంటే మెరుగ్గా ఉండాలి -పిల్లల్లో ప్రేరణ కలిగించేలా పనిచేద్దాం -నాడు నేడు పనుల విషయంలో, జగనన్న కిట్స్ విషయంలో రాజీ ప్రసక్తే లేదు -ఇవి విద్యా శాఖకు అత్యంత ప్రతిష్టత్మకం -అధికారుల, ఉపాధ్యాయుల నిరంతరం పర్యవేక్షణ తోనే సాధ్యం -రాజమహేంద్రవరం లో పలు స్కూల్స్, సచివాలయా లను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ -ముఖ్య కార్యదర్శి వెంట జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఇతర జిల్లా అధికారులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

భేటీ బచావో బేటి పడావో పై అవగాహన కార్యక్రమాలు..

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మార్చి 1 నుంచి 8 వ తేదీ వరకు నిర్వహిస్తున్న భేటీ బచావో బేటి పడావో అమలు పై ఆడపిల్లలకు ప్రతి విషయంలోనూ అవగాహన కల్పించాలని డిప్యూటీ డేమో ఎన్.సత్యకుమార్ అన్నారు. గురువారం బొమ్మూరు గిరిజన సంక్షేమ ఆశ్రమం ఉన్నత పాఠశాల నందు బేటి బచావో బేటి పడావో కార్యక్రమం లో భాగంగా విద్యార్థులకు పిసి అండ్ పిఎండిటి యాక్టర్ మరియు ప్రపంచ మహిళా దినోత్సవం గురించి అవగాహన కార్యక్రమం …

Read More »

సంక్షేమ వసతి గృహాల సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఈ రోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి పట్టణంలోని పలు సంక్షేమ వసతి గృహాలను గురువారం సందర్శించారు. మొదట కె.వి.స్టేట్ హోమ్ ని సందర్శించి అక్కడ వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్ధినులతో మాట్లాడారు. వారికి వసతి గృహంలో ఎలాంటి సమస్యలున్నా తెలియజేయాలని అన్నారు. వారికి మంచి పౌష్టికాహారాన్ని అందించాలని, వారికి అందించాల్సిన సౌకర్యాలలో …

Read More »