-జాతీయ ఆరోగ్య మిషన్ కింద 4,5,6 సెమిస్టర్ విద్యార్థులు హాజరు
-డా సనత్ కుమారీ
అనపర్తి/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందచేసే వైద్య సేవలు, ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఆసుపత్రులలో కలుగచేస్తున్న వైద్య సేవలపై మెడికో లకు అవగాహన సామాజిక చైతన్యం కల్పించడం జరుగుతున్నట్లు డి సి హెచ్ ఎస్ డా ఎమ్. సనత్ కుమారి పేర్కొన్నారు. శుక్రవారం జీ ఎస్ ఎల్ మెడికల్ కాలేజీ కి చెందిన తొలి బ్యాచ్ విద్యార్థులు అనపర్తి ఏరియా ఆసుపత్రి కి రిపోర్ట్ చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా డా . సనత్ కుమారి వివరాలు తెలుపుతూ, వైద్య కళాశాలల్లో చదువుతున్న విద్యను అభ్యసిస్తున్న 4,5,6 సేమిస్టర్ లు మెడికో లకు జాతీయ వైద్య మిషన్ యొక్క కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా శిక్షణ ఇవ్వడం జరుగు తుందన్నారు. ప్రజలకు అందచేస్తున్న వైద్య పరమైన వ్యాక్సినేషన్, ఇమ్మునైజేషన్ తదితర వాటిపై అవగాహన కల్పించే ఉద్దేశంతో చేపడుతున్న ప్రేరణ కార్యక్రమాలు పై మెడికో లకు ఇది ఒక చక్కటి అవకాశం అన్నారు. జి ఎస్ ఎల్ వైద్య కళాశాల కు చెందిన 12 మంది మెడికో లు తొలి బ్యాచ్ గా ఈరోజు హజరవ్వడం జరిగిందన్నారు. మూడు నెలలకు ఒక బ్యాచ్ చొప్పున నిరంతరం మెడికో ల సేవలు తద్వారా , వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ” వైద్యదేవోభవ” సార్థకం చేసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం అని సనత్ కుమారి అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కొత్త బ్యాచ్ మెడికో ల ద్వారా జిల్లా ఆసుపత్రి లో వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందిస్తూ సేవ చేయడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా 12 మంది పీజీ వైద్యులు మూడు నెలల పాటు ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందించనున్నారని తెలిపారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య పరమైన అన్ని వైద్య సేవలను అందిస్తారన్నారు. కొవ్వూరు ఏరియా ఆసుపత్రి కి కూడా మెడి కో ల వైద్య సేవలు అందించడం కోసం జీ ఎస్ ఎల్ ను కోరడం జరిగిందని సనత్ కుమారి తెలియచేశారు.
ఈ సందర్భంగా జీ ఎస్ ఎల్ – పీజీ విద్యార్థులకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద అమలు జరుగుతున్న వివిధ కార్యక్రమాల పై, సీజనల్ వ్యాధుల నివారణకు చేపడుతున్న అవగాహన కల్పించే కార్యక్రమాలపై వివరాలు తెలియ చేయడం జరిగింది.
Prajavartha Online Telugu News