లబ్ధిదారులు స్వచ్చందంగా ఇంటి నిర్మాణానికి చొరవ చూపాలి

-ఉగాది నాటికి రాష్ట్రంలో 5 లక్షల గృహాల గృహప్రవేశానికి సన్నాహాలు చేస్తున్నాం
-ఇంటి నిర్మాణం పూర్తి చేసిన ప్రతి ఇంటికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్
-కలెక్టర్ కే. మాధవీలత

చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీల్లో లబ్దిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.

శనివారం ఉదయం చాగల్లు గ్రామంలో జగనన్న కాలనీ కొత్త లే అవుట్ లను కలెక్టర్ పరిశీలించి, లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రతి ఒక్క లబ్దిదారుడు ప్రభుత్వం ఉచితంగా అందచేసిన ఇంటి స్థలంలో త్వరితగతిన ఇంటి నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మీకు అందచేసిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టకపోతే ఇతరులు అక్రమించుకోవడం గానీ, పక్క ఇంటి వారి ప్రహరీ గోడ మన స్థలంలో నిర్మించుకునే అవకాశం ఉందని అన్నారు. ఇంటి నిర్మాణం కొంత శ్రమ తో కూడుకున్నా, మీ తరువాత వారసులకు ఒక ఆస్తి హక్కు కల్పించే చక్కని అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వమే ఇంటి నిర్మాణం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఇసుక, ఇతర నిర్మాణ ముడిసరుకులు, నీటి వసతి కల్పించడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. మీరు ఇంటి నిర్మాణం చేపట్టడం జరిగితే, ఆమేరకు దశల వారీగా చెల్లింపులు కూడా ఎప్పటికప్పుడు మీ బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎవరైనా సొంత ఇంటిని కనీస కుటుంబ అవసరాలైన విద్య, వైద్యం, ఇతర కుటుంబ ఖర్చుల తరువాత మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. ఐతే ప్రభుత్వం ఉచితంగా ఇంటి స్థలం ఇచ్చి, అందుకు అనుగుణంగా అవసరమైన మేటిరియల్, సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నారు. కొంత ధైర్యం చెయ్యగలిగితే ఇంటి నిర్మాణం పూర్తి చేయగలుగుతారని మాధవీ లత స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణం కోసం ముందస్తు పెట్టుబడిగా అవసరమైన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ఎస్ హెచ్ జి మహిళా సభ్యులకు రుణాలు మంజూరు చేయడం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ లే అవుట్ లలో విద్యుత్, త్రాగునీరు, రహదారులు వంటి పనులను దశల వారీగా ప్రభుత్వమే కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసిన వారికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నామని, ఇందుకోసం రూ.2500 లు చెల్లించనవసరం లేకుండా అధికారులే మీటర్ ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని చెప్పారు. జలజీవన్ మిషన్ కింద చాగల్లు లో పాత లే అవుట్ లో ఉన్న సుమారు 1100 గృహాలకు రూ.51 లక్షలతో త్రాగునీరు వసతి కోసం ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ మాధవీలత తెలియచేశారు. జగనన్న హౌసింగ్ కింద  కొత్త కాలనీ వాసులు సుమారు 600 గృహాలకు రు.74 లక్షలతో కుళాయి కనెక్షన్లు కూడా టెండర్ ప్రక్రియ దశలో ఉన్నట్లు ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులు వివరించారు. లే అవుట్ లకు సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ ద్వారా అనుసంధాన రహదారులను అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రతి సచివాలయ సిబ్బంది వారి పరిధిలో ఉన్న పంచాయతీల కు చెందిన లబ్దిదారులకు అవగాహన కలుగచేసి ఇంటి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. స్టేజ్ కన్వర్షన్ పై నిరంతరం దృష్టి పెట్టడం ముఖ్యమని పేర్కొన్నారు. గ్రామాల వారీగా ప్రగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్ వెంట జిల్లా హౌసింగ్ అధికారి జీ. పరశురామ్, ఎంపీడీవో -బి. రాంప్రసాద్, ఇంచార్జ్ తహసిల్దార్ నిరంజన్ కుమార్, హౌసింగ్ ఏఈ – ఏడుకొండలు, ఆర్ ఆర్డబ్ల్యుఎస్ ఏ ఈ సుర్జాన్, మండల గ్రీవెన్స్ ఆఫీసర్_ చక్రధర్, సచివాలయ సంక్షేమ కార్యదర్శులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *