రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మార్చి 1 నుంచి 8 వ తేదీ వరకు నిర్వహిస్తున్న భేటీ బచావో బేటి పడావో అమలు పై ఆడపిల్లలకు ప్రతి విషయంలోనూ అవగాహన కల్పించాలని డిప్యూటీ డేమో ఎన్.సత్యకుమార్ అన్నారు. గురువారం బొమ్మూరు గిరిజన సంక్షేమ ఆశ్రమం ఉన్నత పాఠశాల నందు బేటి బచావో బేటి పడావో కార్యక్రమం లో భాగంగా విద్యార్థులకు పిసి అండ్ పిఎండిటి యాక్టర్ మరియు ప్రపంచ మహిళా దినోత్సవం గురించి అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ సదంర్భంగా డిప్యూటీ ఏమో ఎన్ సత్యకుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల “భేటీ బచావో బేటి పడావో ” కార్యక్రమాన్ని ఈ నెల 8 వ తేదీ వరకు చేపట్టే ప్రచారంలో భాగంగా ప్రభుత్వం ఆడపిల్లలకు కల్పించే ప్రాధమిక హక్కులు, ఇతర అంశాలపై వారు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునే విధంగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. “భేటీ బచావో బేటి పడావో ” కార్యక్రమాలు పొందు పరచేందుకు వెబ్సైట్ ను రూపొందించడం జరిగిందని ఇందులో ఆయా కార్యక్రమాలకు సంబందించి పలు అంశాలు , పూర్తి సమాచారం ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమం అమలుల్లో భాగంగా ప్రతి అంశం జిల్లా ట్విట్టర్ ఎకౌంట్లో పొందు పర్చడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రియదర్శిని , డిప్యూటీ డెమో ఎన్ సత్య కుమార్ ధవలేశ్వరం పీహెచ్ సి శేషమణి, రాంబాబు, ఎంపిహెచ్ఎస్ కుమార్, ఏఎన్ఎంలు, ఆశా లు ధవలేశ్వరం బాలికల ఉన్నత పాఠశాల, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బీసీ వెల్ఫేర్ ఆశ్రమ బాలికల పాఠశాల బాలికలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News