పేదలందరికీ ఇళ్ళ నిర్మాణాలు ఉగాది నాటికి లక్ష్యాల మేరకు పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలి

-ఈ క్రాప్ పంట నమోదు మార్చి4 లోపు వంద శాతం పూర్తి కావాలి
-రీసర్వే స్టోన్ ప్లాంటేషన్ వేగవంతం చేయాలి
-అమృత్ సరోవర్ కింద 29 చెరువుల అభివృద్ధి పనులు మార్చి నెలాఖరు లోపు పూర్తి కావాలి: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలందరికీ ఇళ్లు గృహ నిర్మాణాలు, రీ సర్వే ,ఎన్ హెచ్ ఏ ఐ భూసేకరణ వ్యవసాయ ఉద్యానవన పశుసంవర్ధక శాఖ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి తదితర శాఖలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో వర్చువల్ విధానంలో అమరావతి నుండి సమీక్షించగా తిరుపతి నుండి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి సంబంధిత అధికారులతో కలెక్టర్ ఛాంబర్ నుండి హాజరయ్యారు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో పై అంశాలపై సమీక్షిస్తూ పలు సూచనలు ఆదేశాలు చేశారు.

వి సి అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ పేదలందరికీ ఇళ్లు గృహ నిర్మాణాలు వేగవంతం కావాలని, ఇప్పటికే పూర్తి అయిన 11582 ఇళ్లతో పాటు పైకప్పు బడిన, స్లాబ్ మట్టంలో ఉన్న ఇల్లు పూర్తి అయ్యేలా ఉగాది నాటికి సామూహిక గృహప్రవేశాలు లక్ష్యాల మేరకు చేపట్టేలా ఉండాలని ఉన్నారు. మార్చి 10 లోపు ఇంకా ప్రారంభం కాని గృహాలను 100% ప్రారంభించాలి అని తెలిపారు. రోజువారి స్టేజి కన్వర్షన్లు లక్ష్యాల మేరకు సాధించాలి అన్నారు. రీ సర్వే డ్రోన్ ఫ్లయింగ్, గ్రౌండ్ ట్రూతింగ్, స్టోన్ ప్లాంటేషన్ వేగవంతం చేయాలని, రీ సర్వే రెండవ దశ గ్రామాలు ఏప్రిల్ చివరి నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. మొదటి దశలో రీ సర్వే పూర్తి అయిన గ్రామాలకు చెందిన భూముల ఎల్ పి ఎం వివరాలను రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ శాఖ వారికి త్వరిత గతిన అందజేయాలి అన్నారు. వారానికి 10 కి తగ్గకుండా సెక్షన్ 13 నోటిఫికేషన్లు పూర్తి చేయాలని ఆదేశించారు. తగినన్ని రోవర్లు ఏర్పాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

రైతుల ఈ కే వైసి 98 శాతం పూర్తి అయిన దానిని, ఈ క్రాప్ పంట నమోదును మార్చి 4వ తేదీ లోపు ఎట్టి పరిస్థితిలో వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. యంత్ర సేవా పథకం లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేలా బ్యాంకర్లతో సమన్వయం చేసుకొని పురోగతి సాధించాలని సూచించారు. స్వామిత్వ, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం కావాలని ఆదేశించారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీల హాజరు, వాటి బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆధార్ సీడింగ్ వేగవంతం చేయాలని అమృత్ సరోవర్ పథకంలో భాగంగా జిల్లాలో పురోగతిలో ఉన్న 29 చెరువుల పునరుద్ధరణ పనులను ఈనెల ఆఖరిలోపు పూర్తి అయ్యేలా ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని డ్వామా అధికారులను ఆదేశించారు.

సచివాలయ భవనాలు ఆర్బికేలు విలేజ్ హెల్త్ క్లినిక్ లు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎప్పటికప్పుడు బిల్లులు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సిమెంట్ కొరత రాకుండా ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టడం చేపట్టాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా దృశ్యపరంగా పరిశుభ్రమైన గ్రామాలు, బహిరంగ మల మూత్ర విసర్జన ప్లస్ గ్రామాలు, ఓడిఎఫ్ ప్లస్ ఆశావహ గ్రామాలు, బహిరంగ మలమూత్ర విసర్జన లేని ఆదర్శ గ్రామాల వివరాలను ఆన్లైన్లో తప్పకుండా కచ్చితత్వంతో నమోదు చేయడం ద్వారా రాష్ట్ర లక్ష్యాలలో పురోగతి కనిపిస్తుందని, కేంద్ర ప్రభుత్వం వారు వీటిని సమీక్షిస్తున్నారని అన్నారు. సచివాలయ భవనాల నిర్మాణాలు, సామూహిక మరుగుదొడ్ల కాంప్లెక్స్ల నిర్మాణాలను సమాంతరంగా చేపట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో ఏ డి సర్వే జయరాజ్, డ్వామా పిడీ శ్రీనివాస ప్రసాద్, జిల్లా పంచాయితీ రాజ్ ఇంజనీర్ శంకర్ నారాయణ, గృహ నిర్మాణ శాఖ పిడి వెంకటేశ్వర్ రావు జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *