మారేడుమిల్లి, రంపచోడవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశంలో వివిధ రాష్ట్రాలలలో గిరిజన ప్రాంతంలోని మారుమూల గ్రామాల ప్రజలకు జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగిందని కేంద్ర ప్రభుత్వ అడిషనల్ జల జీవన్ మిషన్ కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ పేర్కొన్నారు. శుక్రవారం మారేడుమిల్లి మండలం వేటుకూరు పంచాయతీలోని పందిరి మామిడి కోట గ్రామంలోని జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగు నీరు కులాయిలు ప్రారంభోత్సవానికి కేంద్ర ప్రభుత్వ జల జీవన్ మిషన్ అడిషనల్ కార్యదర్శి కమల్ కిషోర్ షోన్, పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, గ్రామీణ నీటిపారుదల ఇంజనీరింగ్ చీఫ్ గాయత్రి ముఖ్య అతిథులుగా హాజరై త్రాగినీటి కులాయిని ప్రారంభించారు.ఈ సందర్భంగా జాతీయ జల జీవన్ మిషన్ అడిషనల్ కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ మాట్లాడుతూ దేశంలోని గిరిజన ప్రాంతాలలో గిరిజనులు అనారోగ్యము కాకుండా జల జీవన్ మిషన్ ద్వారా మారుమూల గ్రామాలకు జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీరు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.జల జీవన్ మిషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు,అంగన్వాడీ కేంద్రాలకు,ఆసుపత్రులకు, పంచాయితీ కార్యాలయాలకు,గ్రామీణ గృహాలకు,త్రాగునీరు అందించే విధంగా ఎక్కడికి అక్కడ తగు చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు.ప్రతిరోజు జల జీవన్ మిషన్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ప్రతిరోజు సుమారు 55 లీటర్ల సురక్షితమైన త్రాగు నీటిని అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆయన అన్నారు. వివిధ గ్రామాలలో చాలా దూరం నుండి త్రాగునీరు తెచ్చుకోవడం సురక్షితం కాదని సమయం కూడా ఎక్కువ తీసుకుంటుందని ఇంటి వద్దకే సురక్షితమైన నీటిని అందించడం వలన మీ మీ కుటుంబాలకు సమయం ఆదా అవుతుందని ఆయన అన్నారు.జల జీవన్ మిషన్ ద్వారా ఏర్పాటుచేసిన ఇంటింటి కుళాయిలు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలని ఆయన అన్నారు. ఈ గ్రామంలోని కొంతమంది గిరిజనులకు ఢిల్లీ తీసుకెళ్లడం జరుగుతుందని ఆయన అన్నారు. పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని తరతరాలుగా కాలువలోని చలమ నీరు తాగి గతంలో అనారోగ్య పాలఅయ్య వారని అదేవిధంగా గిరిజన ప్రాంతంలోని ప్రజలు త్రాగునీటి ద్వారా ఎటువంటి వ్యాధులు రాకుండా జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీరు కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ పందిరి మామిడి కోట గ్రామంలో జల జీవన్ మిషన్ నిధులతో 15.7 లక్షల రూపాయల వ్యయంతో 20వేల లీటర్ల ట్యాంక్ కెపాసిటీ తో 98 కుటుంబాలకు ఇంటింటికి త్రాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు.జల జీవన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన కుళాయిలు ప్రతి ఇంటిలో త్రాగు నీటిని వృధా చేయకుండా త్రాగునీటి కుళాయిలు చెడిపోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నీటిని వాడుకోవాలని ఆయన అన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా ఎప్పటికప్పుడు త్రాగు నీటిని టెస్ట్ చేసే విధంగా ఐదుగురు సభ్యులను గ్రామ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలోని రానున్న తరాల వారికి భూగర్భ జలాలు సుమారు 6 మీటర్లు పెంచాలని ఆయన అన్నారు. ప్రతి వర్షపు నీటి బొట్టును వృధా కాకుండా ఎక్కడికి అక్కడ నీటిని కట్టడ చేసి భూగర్భ జలాన్ని పెంచే బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. పూర్వ నుండి కాలువల నీరు తాగడం వలన బాగుందా అదేవిధంగా జల జీవన్ మిషన్ ద్వారా త్రాగునీరు పథకం ద్వారా ఇంటింటికి కుళాయిలు వేయడం ఈ పథకం బాగున్నదా అని గ్రామస్తులను ఆయన అడిగి తెలుసుకున్నారు.పూర్వం నుండి పందిరి మామిడి కోటలోని గిరిజనులు కాలువలోని చలమలు నీటిని ఏ విధంగా గతంలో ఏర్పాటు చేసుకున్నది ముఖ్య అతిథులు పరిశీలించారు. చలమ నీటిని వృధా కాకుండా జలదార ప్రోగ్రాం ద్వారా నీటిని మీ గ్రామాల్లోని ప్రజలకు వివిధ రకాలైన పంటలు ఏర్పాటు చేసుకునే విధంగా జలదార ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర గ్రామీణ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ గాయత్రి మాట్లాడుతూ జల జీవన్ మిషన్ ద్వారా ఏర్పాటుచేసిన ఇంటింటికి త్రాగునీటి కులాయిని సద్వినియోగపరచుకొని మీ కుటుంబాలలోని అందరూ ఆరోగ్యకరంగా ఉండటమే జల జీవన్ మిషన్ యెక్క ముఖ్య ఉద్దేశమని ఆమె అన్నారు. ఎప్పటికప్పుడు జల జీవన్ మిషన్ గ్రామ కమిటీ సభ్యులు త్రాగునీటిని ఎప్పటికప్పుడు టెస్టులు చేసి ఇంటింటికి త్రాగునీరు అందించాలని ఆమె అన్నారు. ఇంటింటికి జల జీవన్ ద్వారా త్రాగునీరు అందించే విధంగా గ్రామ సభ ద్వారా ఘర్ ఘర్ జల్ తీర్మానం చేయడం జరిగింది. ఇంటింటి కులాయిలు ఏర్పాటుచేసిన గిరిజనులతో త్రాగునీరు వృధా చేయను, పరిసరాలు పరిశుభ్రతను పాటిస్తామని, భూగర్భ జలాలు పెంచుతానని, మా వంతు కృషి చేస్తామని, పైపులైన్లను జాగ్రత్తగా సంరక్షిస్తామని, నీటి కాలుష్యం చేయము అని, నీటి వనరులను సంరక్షించి కాపాడుతామని, రాబోయే తరాల వారికి నీటిని పరిరక్షిస్తామని,నీటి సరఫరా వ్యవస్థను సమిష్టిగా నిర్వహించి రక్షిస్తామని గ్రామస్తులందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం వివిధ రకాలైన సామాజిక పింఛన్లు కత్తుల పుష్పంకు, కత్తుల పండ్లమ్మకు, కత్తుల సోమలమ్మకు,రేవుల సోమలమ్మకు ముఖ్య అతిథులు వారి చేతుల మీదుగా పింఛన్ అందజేయడం జరిగింది.
ముందుగా గ్రామస్తులు కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ అడిషనల్ కార్యదర్శి వారికి , జిల్లా కలెక్టర్ వారికి, గిరిజన నృత్యాలతో హారతులతో పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అదేవిధంగా గ్రామస్తులు పూలదండలతో సాలవాలతో ముఖ్య అతిథులకు సన్మానించడం జరిగింది.గ్రామ పెద్ద అయినటువంటి రేవుల జానకి రెడ్డి జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కులాయిలు ఏర్పాటు చేసినందుకు కార్యదర్శి వారికి , జిల్లా కలెక్టర్ వారికి గ్రామస్తుల ద్వారా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటిపారుదల శాఖ సూపర్డెంట్ ఇంజనీర్ మితిన్, ఈఈ లు నాగేశ్వరరావు, గిరి, శివాజీ, డి ఈ సుబ్బారావు, గ్రేస్ రాజ్, తాసిల్దార్ అమ్మాజీ, ఎంపీడీవో చంద్రశేఖర్, ఏవో కుమారి, ఏఈలు నారాయణరావు,ఎస్ శ్రీనివాస్,సీతారాం నాయక్, సురేష్ బాబు,డాక్టర్ నితిన్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News