Breaking News

కొత్త ఓటర్ల నమోదు కు ప్రత్యేక క్యాంప్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవటానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులో ప్రజలు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాల్సిందిగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అన్నారు. శనివారం, మహిళా మాంటిసోరి కళాశాల మరియు బిషప్ హజరయ్య పాఠశాల గల పోలింగ్ బూతులను ఇంచార్జ్ కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ నిధి మీనా, సెంట్రల్ ఎలక్ట్రాల్ ఆఫీసర్ కమిషనర్ ధ్యానచంద్ర, ఈస్ట్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ కే చైతన్యకుమార్ తో పర్యటించి అక్కడ జరుగుతున్న ఓటర్ నమోదు క్యాంపెయిన్ ను పరిశీలించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఎలక్టోరల్ అధికారి గారి సూచనలు మరియు ఉత్తర్వుల ప్రకారము ది.09.10.2024 (శనివారము), 10.10.2024(ఆదివారము), 23.11.2024 (శనివారము) మరియు 24.11.2024 (ఆదివారము) సంబంధిత పోలింగ్ స్టేషన్ల యొక్క పరిధిలో ఓటర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించవలసినదిగా ఆదేశించియున్నారు.

కావున, సదరు ఆదేశముల ప్రకారము ది.09.10.2024 (శనివారము),10.10.2024 (ఆదివారము), 23.11.2024 (శనివారము) తేదీన విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 80-సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గము పరిధిలోని పోలింగ్ స్టేషన్లు 1 నుండి 267 పోలింగ్ కేంద్రములలో ఓటర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించటమైనది. అవగాహన సదస్సులో స్థానిక ప్రజలు సంబంధిత పోలింగ్ స్టేషనునకు వెళ్ళి ఓటర్ జాబితాను పరిశీలించుకొనవలసినదిగా కోరడమైనది. క్రొత్తగా ఓటర్ గా నమోదు కొరకు, ఓటర్ జాబితాలో తప్పులు, మరణించిన, వేరే ప్రదేశమునకు మారిపోయిన సంబంధిత ఫారములను పూర్తిచేసి ఇచ్చిన పిమ్మట పరిశీలించి తదుపరి చర్యలు గైకొనబడునని తెలియపరచడమైనది. ఉదయము 10:00 గంటల నుండి సాయంత్రము 05:00 గంటల వరకు సంబంధిత బూతు లెవల్ అధికారి పోలింగ్ స్టేషన్ లో అందుబాటులో ఉండుటకు నిర్దేశించగా. స్థానిక ప్రజలు సంబంధిత పోలింగ్ స్టేషనునకు వెళ్ళి ఓటర్ జాబితాను పరిశీలించుకొనవలసినదిగా కోరడమైనది. క్రొత్తగా ఓటర్ గా నమోదు కొరకు, ఓటర్ జాబితాలో తప్పులు, మరణించిన, వేరే ప్రదేశమునకు మారిపోయిన సంబంధిత ఫారములను పూర్తిచేసి ఇచ్చిన పిమ్మట పరిశీలించి తదుపరి చర్యలు గైకొనబడునని తెలియపరచడమైనది.

18 సంవత్సరాలు నిండినట్లయితే, కొత్త ఓటర్ గా నమోదు చేసుకోవడానికి ఇప్పుడు సంవత్సరానికి నాలుగు అవకాశాలు ఉన్నాయని, జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండినట్లయితే నవంబర్ 28వ తేదీ వరకు జరిగే ఈ క్యాంపెయిన్ లో ప్రతి పోలింగ్ బూత్ లో ఫామ్ 6 నింపి దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు.

ఓటర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు లో భాగంగా వివేక్ యాదవ్, ప్రధాన ఎన్నికల నిర్వహణ అధికారి ఆంధ్ర ప్రదేశ్ వారు క్షేత్ర స్థాయి పరిశీలన చేయుటకు 80-విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో గల బిషప్ అజరయ్య స్కూల్ మరియు కాలేజి నందు ఏర్పరించిన 11 పోలింగ్ కేంద్రములను సందర్శించటమైనది. సందర్శన లో భాగంగా, బూత్ లెవెల్ అధికారులకు సూచనలు చేసినారు. ఈ కార్యక్రమములో నిధి మీన, జిల్లా ఎన్నికల అధికారి మరియు ఇంచార్జి కలెక్టర్ యన్ టి.ఆర్ జిల్లా , విజయవాడ వారు , ధ్యానచంద్ర సెంట్రల్ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి మరియు కమీషనర్ విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ వారు , కె.చైతన్య ఈస్ట్ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 80-సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గము పరిధిలోని పోలింగ్ స్టేషన్లు (1 నుండి 267) పరిధిలోని ప్రజలు సదరు ప్రత్యేక అవగాహన సదస్సును పూర్తిగా వినియోగించుకొనవలసినదిగా కోరారు.

ఓటర్ జాబితాలోని కొత్త ఓటర్లను నమోదు చేసుకునేందుకు ఆన్లైన్ లో www.nvsp.in, www.ceoandhra.nic.in దరఖాస్తు చేసుకోగలరని, మోటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కొత్త ఓటర్లను నమోదు చేయగలరని లేదా ఆఫ్లైన్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో బూత్ లెవెల్ అధికారికి లేదా ఈ ఆర్ ఓ, ఏ ఈ ఆర్ ఓ కార్యాలయాన్ని సంప్రదించగలరని తెలిపారు.

కొత్తగా ఓటర్ దరఖాస్తు చేసుకోవడానికి ఫామ్ 6 ను, పేరును డిలీట్ చేసుకునేందుకు ఫార్మ్ 7 ను, ఓటర్ కార్డులో చిరునామా మార్పు కొరకు ఫామ్ 8 ని నింపి, ఈ కాంపెయిన్ లో అందించవచ్చని తెలిపారు.

ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) పి సత్యకుమారి, అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, తాసిల్దార్లు, బూతు లెవెల్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *