విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్/ కలెక్టర్, ఎన్ టి ఆర్ మరియు వారి ఆదేశాల మేరకు 81-విజయవాడ తూర్పు నియోజక వర్గ పరిధిలో ది.01.01.2025 నాటికి 18 సం,, నిండిన ప్రతి వ్యక్తి మరియు అర్హులు అయి ఉండి ఇప్పటి వరకు ఓటు హక్కు పొందని వారిని గుర్తించి ఓటు హక్కు నమోదు చేసుకొనుట కొరకు ది.23.11.2024 మరియు 24.11.2024(శనివారం & ఆదివారం ) ప్రతి పోలింగ్ బూత్ లోకషన్ల వద్ద ఓటర్ల నమోదు కొరకు ప్రత్యెక క్యాంపులు నిర్వహించవలసినదిగా ఆదేశించి యున్నారు.
సదరు కార్యక్రమములో భాగంగా పోలింగ్ కేంద్రముల తనిఖి నిమిత్తం రోజు అనగా ది. 23.11.2024 ఉదయం 10.30 గం,, లకు తూర్పు ఎన్నికల నియోజక వర్గ పరిధిలో గల మంటిస్సోరి డిగ్రీ మహిళా కళాశాల, పున్నమ్మతోట నందు గల 141, 142, 143, 144 పోలింగ్ కేంద్రములను చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ వారు మరియు కమీషనర్, మునిసిపల్ కార్పొరేషన్ , విజయవాడ వారు మరియు జిల్లా రెవిన్యూ అధికారి వారు మరియు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి & సబ్ కలెక్టర్ వార్లచే సదరు పోలింగ్ కేంద్రములను పరిశిలించడమైనది. ఆ పోలింగ్ కేంద్రములకు సంబంధించిన బూత్ లెవెల్ అధికారులకు తగు సూచనలు / సలహాలను జారి చేసియున్నారు మరియు యాంగ్ ఓటర్లను అనగా 18-19 సం,,గల యువతీ యువకులను గుర్తించి వారికీ ఓటు హక్కు కలిపించవలసినిదిగా ఆదేశించి యున్నారు.
సదరు పరిశిలన కార్యక్రమమునకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, సబ్ కలెక్టర్ , విజయవాడ , అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు అడిషనల్ కమీషనర్ జనరల్ , నగరపాలక సంస్థ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్, నగరపాలక సంస్థ , తహసిల్దార్, తూర్పు మండలం మరియ సూపర్ వైజర్ల తూర్పు నియోజకవర్గమునకు సంబంధించిన డిప్యూటీ తహసీల్దార్ మరియు వారి యొక్క సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News