కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుంది…

-గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న ఈబోర్డుల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నీటివాటాను పూర్తిగా వినియోగించుకోగలం…
-కృష్ణా, గోదావరి మీద ఉన్న ఈ ప్రాజెక్టులు అన్నీ ఆపరేషన్ అండ్ మెయింటినెన్సకొరకు కెఆర్ యంబి, జిఆర్ యంబికు
అప్పగిస్తారు…
-ఈ నోటిఫికేషన్ ఉత్తర్వులు 2021 అక్టోబరు 14 నుండి అమల్లోకి వస్తాయి.
-జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు, గోదావరి రివర్ యాజమాన్య బోర్డుల పరిధిని నోటి ఫై చేస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులను కాపాడుతుందని ఈ చర్యను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖా కార్యదర్శి జె.శ్యామలరావు అన్నారు.
విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కార్యదర్శి జె. శ్యామలరావు మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం జూన్ 2014 నుండి 60 రోజుల్లో పే నోటిఫై చేయవలసి ఉందని అయితే ఇంతవరకూ నోటిఫై చేయని కారణంగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నీటి విడుదలకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నాయని ఈ 7 ఏళల్లో ఎటువంటి వివాదాలు లేవని ఆయన అన్నారు. కానీ గత 45 రోజులుగా అంటే జూన్ 1వ తేదీ నుండి తెలంగాణా రాష్ట్రం స్వతంత్యంగా విద్యుత్తు ఉత్పత్తి చేయడం మొదలు పెట్టిందని, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి ఏకపక్షంగా విద్యుత్తు ఉత్పత్తి మొదలు పెట్టిందని శ్యామలరావు అన్నారు. విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి విడుదల కోసం కెఆర్ యంబికి ఇండెంట్ ఇస్తుందని దాన్ని ఆధారంగా చేసుకుని కెఆర్ యంబి రిలీజ్ ఆర్డరు ఇస్తుందని అప్పుడే విద్యుత్తు ఉత్పత్తి చేయవలసి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణా విద్యుత్తు ఉత్పాదన చేస్తున్నదని శ్యామలరావు అన్నారు. తెలంగాణా ప్రభుత్వం స్వతంత్ర్యంగా విద్యుత్తు ఉత్పత్తి చేయడం మొదలు పెట్టిందని జూన్ 28న నూటికి నూరు శాతం విద్యుత్తు ఉత్పత్తి చేయాలని తెలంగాణా ప్రభుత్వం జిఓ 34 విడుదల చేసిందని శ్యామలరావు అన్నారు. దీనిఫలితంగా శ్రీశైలం జలాశయంలో జూన్ 1 నుండి 30.38 టియంసిల ఇన్‌ఫ్లో ఉంటే దానిలో 29.82 టియంసిలను తెలంగాణా ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తికి వినియోగించిందని దీనివలన శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరగ లేదన్నారు. శ్రీశైలం జలాశయం నీటినిల్వ 806.8 అడుగుల వద్దే ఉండిపోయిందన్నారు. శ్రీశైలం జలాశయం నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి నీటిని విడుదల చేయాలంటే కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలని, ఆస్థాయి నీటిమట్టం ఉంటేనే గ్రావిటీ ఫ్లోలో కనీస నీటిని విడుదల చేయగలుగుతామని ఆయన అన్నారు. గరిష్టంగా నీటిని విడుదల చేయాలంటే 880 అడుగుల నీటి మట్టం నిల్వ సామర్ధ్యం ఉండాలని ఆయన అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే వచ్చిందని శ్యామలరావు అన్నారు.
జూన్ 1వ తేదీ నుండి ఇప్పటివరకూ తెలంగాణా ప్రభుత్వం 66 టియంసిల నీటిని విద్యుత్తు ఉత్పత్తికోసం వినియోగించిందని, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కెఆర్ యంబి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లిందని, విద్యుత్తు ఉత్పత్తి చేయడం సరికాదని తెలంగాణా ప్రభుత్వానికి సూచించినా వారు విద్యుత్తు ఉత్పత్తి నిలుపుదల చేయలేదని శ్యామలరావు అన్నారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన రెడ్డి ప్రధానమంత్రికి లేఖవ్రాసారని ఈ లేఖలో చాలా స్పష్టంగా తెలంగాణా ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కెఆర్ యంబి పరిధిలో నోటిఫై చేయడంతోపాటు ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కెఆర్ యంబికి ఇవ్వాలని, ఈ ప్రాజెక్టుల భద్రతా బాధ్యతలను సిఐయయఫ్ వంటి కేంద్ర రక్షణదళాలతో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం కెఆర్ యంబి ద్వారా ఆదేశాలు జారీ చేసినా వాటిని కూడా తెలంగాణా ప్రభుత్వం అమలు చేయలేదని ఈ సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని తెలంగాణా ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తికి జారీ చేసిన జిఓ నెంబరు 34ను నిలుపుదల చేయాలని, కెఆర్ యంబి పరిధిని నోటి ఫై చేయడంతోపాటు ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కెఆర్ యంబి స్వతంత్యంగా నిర్వహించాలని కోరామని శ్యామలరావు అన్నారు. కేంద్రప్రభుత్వం ఈ నెల 15న కెఆర్ యంబి పరిధిని నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని ఈనోటిఫికేషన్ ద్వారా కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కసం కెఆర్ యంబి మరియు జిఆర్ యంబికి అప్పగిస్తారని ఈ ఉత్తర్వులు 2014 అక్టోబరు 1 నుండి అమల్లోకి వస్తాయని శ్యామలరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈనోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నామని దీనిద్వారా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నీటివాటా మనకు వస్తుందని దాన్ని మనం పూర్తిగా వినియోగించుకోగలమని శ్యామలరావు అన్నారు. ఈ గెజిట్ నోటిఫికేషన్లో కూడా కొన్ని సరిచేయవలసిన అంశాలు ఉన్నాయని వాటిని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వాటిని సరిచేస్తామని మొత్తానికి ఈ గెజిట్ నోటిఫికేషన్‌ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్వాగతిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు అన్నారు. వెలిగొండ లాంటి ప్రాజెక్టుకు అనుమతి లేని ప్రాజెక్టుగా చూపించడంలో అక్షర దోషాలు దొర్లాయని వాటిని సవరించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని ఆయన అన్నారు. విభజన చట్టంలో ఉన్న విధంగా కృష్ణారివర్ మేనేజ్ మెంట్ బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే ఏర్పాటు చేయవలసి ఉందని అన్నారు. దిగువు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేసాక ఎలా వినియోగించుకోవాలనేది దిగువు రాష్ట్రంగా ఏపికి ఉన్న హక్కు అని శ్యామలరావు అన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరులశాఖ ఇయన్ సి సి.నారాయణ రెడ్డి, ఇంటర్ స్టేట్ వాటర్ రిసోర్సస్ డిపార్ట్ మెంట్ చీఫ్ ఇంజినీర్ కె.ఏ. శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *