Breaking News

గుణదల ఆర్‌ఓబి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సన్నహాలు…

-గుణదల ఆ ఓబి పనులను పరిశీలించిన కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-అడ్డంకులను అధిగమించి నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు…

-జిల్లా కలెక్టర్ జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పరిధిలో గుణదల ఆడ్లీబి నిర్మాణ పనులకు ప్రాముఖ్యతను ఇస్తూ త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు.

శుక్రవారం గుణదలలోని ఆర్‌ఓబి నిర్మాణ విషయంపై కార్నల్ నగర్ డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఆర్ఓబి నిర్మాణ స్థలాన్ని, ఏలూరు రోడ్డలోని ఆర్‌ఓ నిర్మాణ స్థలాని శుక్రవారం బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణుతో కలసి జిల్లా కలెక్టర్ జె. నివాస్ సందర్శించారు. వీరి వెంట వియంసి కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవిలత, విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్, అసిస్టెంట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, కార్పొరేటర్ సునీత తదతరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయలో మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్లాండ్ బి అధికారులతో జిల్లా కలెక్టర్ జె.నివాస్ సమీక్షించారు.

ఈ సందర్భంగా జె.నివాస్ మాట్లాడుతూ గుణదల ఆ ఓబి నిర్మాణం చాలా కాలంగా నిలిచి ఉందని ఇందుకు అడ్డంకిగా నిలిచిన అంశాలను సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కర చర్యల కోసం ఈరోజు ఈ ప్రాంతాల్లో సందర్శించడం జరిగిందన్నారు. ఇటువంటి ప్రధాన ప్రాజెక్టు వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేసేందకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. కాలవ గట్టుపై ఎన్ క్రోచ్ మెంట్ లో ఉన్న ఇళ్లు కోల్పోయిన వారందరికి ఇప్పటికే ఇళ్లుకు ప్రభుత్వమే సొమ్ము చెల్లిస్తున్న కారణంగా వారికి ఎటువంటి ఇబ్బంది వుండబోదని ఆయన అన్నారు. వంతెన నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన వారికి నూతన గృహాలు మంజూరు చేసి నష్టపరిహారం అందజేస్తారన్నారు. ఇళ్లు నష్టపోయిన వారిని ప్రభుత్వ అన్ని విధాల అదుకుంటుందన్నారు. గుణదల ఆర్ఓబి నిర్మాణానికి సంబంధించి మొదటి దశలో 2,550చ.మీ. భూసేకరణ పూర్తి చేసి రూ.2 కోట్ల 10 లక్షలు నష్టపరిహారంగా అందించారన్నారు. రెండవ దశలో ఏలూరు రోడ్డులోని 27 సెంటు ప్రైవేటు భూమికి, 114 ఇళ్ళకు సంబంధించి నష్టపరిహారంగా మొత్తం రూ. 15 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. నగరంలో గుణదల ఆ ఓబి పూర్తయితే కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కారం అవుతాయని దీనికి సంబంధించి రెవెన్యూ, ఆర్ఎండ్ బి అధికారులు త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ అన్నారు.

బ్రహ్మణకార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ గుణదల ఆ ఓబి నిర్మాణం ఎప్పుడో పూర్తి కావాలసి ఉందని ఈ ప్రాంతంలో మూడు బ్రిడ్జిలు, మూడు కాలవలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా రద్దీ వుంటుందని నిత్యం 10 వేల మంది రాకపోకలు జరుగుతాయన్నారు. వీరు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆర్‌ఓబి నిర్మాణానికి 23 కోట్లు మంజూరు చేస్తూ జివోను కూడా విడుదల చేశారన్నారు. స్టేజ్ -1లో భూ సేకరణ పూర్తి చేయడం జరిగిందన్నారు. రెండవ స్టేజ్ పనులకు రెండు నెలల్లో టెండర్లు పూర్తి చేసి 2 సంవత్సరాలోపు గుణదల ఆ ఓబిని త్వరితగతిన పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. వంతెన నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన వారికి లాటరీ ద్వారా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ ఆర్ఓబి నిర్మాణానికి వారు సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో ఆర్ఘాండ్ బి ఈఈ కృష్ణనాయక్, డిఈ రాధకృష్ణ, తహాశీల్దార్లు దుర్గాప్రసాద్, వియంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *