విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తోందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. కుందవారి కండ్రికలోని రైతుభరోసా కేంద్రం నందు వైఎస్సార్ రైతు భరోసా చైతన్య యాత్రలలో భాగంగా నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతోందన్నారు. రైతు భరోసా కేంద్రాల విధివిధానాలు, ఈ–క్రాపింగ్ తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో రైతుభరోసా యాత్రలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. యాత్రల ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారడిగిన సందేహాలను నివృత్తి చేశారు. సాగులో తీసుకొస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం, మెళకువలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ నెల 23వ తేదీ వరకు రైతు భరోసా చైతన్య యాత్రలు కొనసాగుతాయని పేర్కొన్నారు. త్వరలోనే గ్రామంలో పశువైద్యశాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో 64వ డివిజన్ కార్పొరేటర్ యర్రగొర్ల తిరుపతమ్మ శ్రీరాములు, వ్యవసాయ, పశుసంవర్థక శాఖ అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …