విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువ ఉత్సవ్ కార్యక్రమం నేటి యువతరానికి స్పూ ర్తిదాయకంగా ప్రతిభా పాటవాలను వెలికి తీసేలా, దేశభక్తిని పెం పొందించేందుకు ఉప యోగపడుతుందని ఈ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న వేవ్స్ మీద రాజిందర్ చౌదరి ప్రత్యేక అవగాహన ప్రదర్శన చేశారు. వేవ్స్ నిర్వహించే పోటీలలో పాల్గొనవలసిందిగా విద్యార్థులను కోరారు. నెహ్రూ యువ కేంద్ర ,ఎన్టీఆర్ మరియు విఐటి డబ్ల్యు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ‘యువ ఉత్సవ్- 2024″ కార్యక్రమం విఐటి డబ్ల్యు మహిళా కళాశాల ఎనికేపాడు ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన విజయవాడ పిఐబి అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజిందర్ చౌదరి మాట్లాడుతూ యువతరం సానుకూల దృక్పథంతో పోటీ ప్రపంచంలో రాణించాలన్నారు. ఉరకలెత్తే ఉత్సాహం చూపించే యువతను చూస్తే తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయన్నారు. ఎన్టీఆర్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ శుభమ్ నోక్వాల్ మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే గెలుపోటములను సమానంగా స్వీకరించాలని యువతకు ఉద్బోధించారు. నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలని హితవు పలికారు యువ ఉత్సవ్లో భాగంగా ఇండియా 2047 నాటికీ దేశం ప్రపంచానికి దిక్సూచి లా ఉండాలన్నారు. అనంతరం విద్యా ర్థులు నిర్వహించిన వివిధ సంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టు కున్నాయి. అనంతరం పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం నిర్వాహకులు వినోద్ కుమార్ జిల్లా అధికారులు ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News