Breaking News

అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు

-మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫు నుండి ₹5 లక్షల చొప్పున పరిహారం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర రవాణా,యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం, కలగాసుపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాత పడటంపై తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు గారు ఘటనపై స్పందించి బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చి ఒక్కో మృతుని కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సాధారణ కుటుంబానికి చెందిన మృతులు కూలీ పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *