Breaking News

అగ్ని ప్రమాద బాధితులకు ఆపన్న హస్తం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో మల్లిఖార్జున పేటలోని అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. మల్లికార్జున పేటలో నివాసం ఉంటున్న పుట్టపు సత్యనారాయణ కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆయన నివాసం ఈనెల 25 వ తేదీ సోమవారం అగ్ని ప్రమాదానికి దగ్ధమైంది. తమకు సాయం అందించాలని ఎమ్మెల్యే సుజనా చౌదరిని వారు కొరగా తక్షణమే సాయం అందజేయాలని తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయ సిబ్బంది బుధవారం ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే సుజనా కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *