Breaking News

జర్మన్ భాష నందు ఉచిత శిక్షణ మరియు జర్మనీ దేశంలో నర్సులుగా ఉద్యోగ అవకాశాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జర్మన్ భాష నందు ఉచిత శిక్షణ మరియు జర్మనీ దేశంలో నర్సులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున రాష్ట్ర ప్రభుత్వం.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నడాక్టర్ ఆర్. వి కుమార్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్స్లర్ స్వీమ్స్ యూనివర్సిటీ వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బీఎస్సీ నర్సింగ్ మరియు జిఎన్ఎమ్ నర్సింగ్ పూర్తి చేసి హాస్పిటల్ నందు నర్సింగ్ కేర్ నందు కనీసం రెండు నుంచి మూడు ఏళ్ల అనుభవం కలిగి ఉన్న నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ దేశం నందు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉద్యోగాల కొరకై జర్మనీ భాష నేర్పించి మరియు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కొరకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ , ఓమ్ క్యాప్ వారు ఎస్ఎంకేర్ సొల్యూషన్స్ జిఎంబిహ్ మరియు హాల్లో లాంగ్వేజ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో స్కిల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మాంట్ ప్రోగ్రాం ఇన్ జర్మన్ లాంగ్వేజ్ అను కార్యక్రమం స్వీమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తిరుపతి నందు ఆరు నెలలు ఉచితంగా శిక్షణా మరియు ఉపాధి అవకాశాలసు సంబంధించి ఈరోజు ప్రారంభించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ అల్లాడి మోహన్, డీన్ ఆఫ్ యూనివర్సిటీ మాట్లాడుతూ నూతన భాష నేర్చుకోవడం వల్ల జర్మన్ దేశంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి కావున శ్రద్ధ ఆసక్తితో వారి శక్తి సామర్ధ్యాలను ఉపయోగించి బాగా నేర్చుకొని ఈ ఆరు నెలల శిక్షణలో బాసపై పూర్తిగా సృజనాత్మ శక్తితో, పట్టు సాధించి రాణించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తర్వాతే డాక్టర్ వనజాక్షి, ఇన్చార్జ్ రిజిస్టర్ స్విమ్స్ యూనివర్సిటీ వారు మాట్లాడుతూ కొత్త భాష నేర్చుకోవడం వల్ల జ్ఞాపకశక్తి ఆత్మస్థైర్యం మెంటల్ ఎబిలిటీ పరిజ్ఞానం పెంపొందించుకోవడంతోపాటు తెలివితేటలు అభివృద్ధి చెంది అలాగే జర్మన్ లో నర్సింగ్ కొత్త విధానంలో ముందుకెళ్తూ అవకాశాలు ఎందుకు పుచ్చుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ విద్యార్థులకు సువర్ణ అవకాశంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జర్మన్ దేశ ప్రతినిధులు మిస్ సచికోయిసోబ్(Sachikoisobe) మేనేజింగ్ డైరెక్టర్ ఏస్ఏమ్ కేర్ వారు మాట్లాడుతూ జర్మన్ ప్రభుత్వం నర్సుల కోసం ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు అందిపుచ్చుకొని రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు జర్మన్ భాష పై పట్టు సాధించడానికి కోసం జర్మన్ భాష పై శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అనేక అవకాశాలను పొందుపరచడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు, మరియు ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జర్మన్ భాష చక్కగా నేర్చుకొని అన్ని లెవెల్స్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళకి జర్మనీ దేశం నందు ఉద్యోగం అవకాశం కల్పించడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మరో అతిథిగా పాల్గొన్న మనోహర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీ ఎస్ఎస్డిసి మరియు జనరల్ మేనేజర్ ఓమ్ క్యాప్ వారు మాట్లాడుతూ రాష్ట్రం నలువైపుల నుండి నర్సింగ్ చేసిన విద్యార్థులకు జర్మన్ భాష పై ఆరు నెలలు శిక్షణ ఇచ్చి మరియు వారికి జర్మన్ దేశంలో ఉద్యోగ కోసం కల్పించడానికి రాష్ట్రం నందు పలుచోట్ల శిక్షణ కార్యక్రమంలో ఏర్పాటు చేసి వారికి జర్మన్ భాష పై పట్టు సాధించడానికి ఉచితంగా శిక్షణ ఇచ్చి A1, A2, B1, B2 లెవెల్ లో అర్హత సాధించడానికి అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇదివరకే జర్మన్ భాష పై శిక్షణ పొందడానికి రిజిస్టర్ చేసుకున్న ఎనిమిది (8) మండి విద్యార్థులకు ముందస్తు ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో అతిధులుగా ఏ నటరాజ్, సీఈఓ, హాల్లో లాంగ్వేజ్, ప్రొఫెసర్ డాక్టర్ పి సుధారాణి, ప్రిన్సిపల్, స్విమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, రాజశేఖర్ ఏది & పిఆర్ఓ, స్విమ్స్ యూనివర్సిటీ, శ్రీనివాస్, రీజినల్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ తిరుపతి, ఆర్ లోకనాథం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ తిరుపతి, రెహానా ఖాన్, ఎన్ ఏస్ డి ఓ, మరియు ఏపీ ఎస్ఎస్డిసి సిబ్బంది వారు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *