Breaking News

సముద్రంలో చిక్కున్న మత్స్యకారులను సురక్షితంగా కృష్ణపట్నం పోర్ట్ కు చేర్చిన జిల్లా యంత్రాంగం

-సకాలంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సముద్రంలో చిక్కున్న మత్స్యకారులు సురక్షితంగా కాపాడి కృష్ణపట్నం పోర్ట్ కు చేర్చడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాయుగుండం బలపడి తుఫాన్ తీవ్రతరం అవుతుందని, దీని ప్రభావం వలన ఈ నెల 26 నుండి 28 వరకు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందస్తుగా మత్స్యకారులను సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. అయినప్పటికీ నెల్లూరు జిల్లాకు చెందిన తొమ్మిది(09) మందిమత్స్యకారుల తో కూడిన మెకనైజేడ్ బోట్ తిరుపతి తీరం వాకాడు మండలంలోని వడపాలెం మరియు వై.టి.కుప్పానికి సముద్రంలో 14 కిలో మీటర్ల దూరంలో బోట్ ఇంజను పాడైపోవడంతో బోట్ లో ఉన్న జాలర్ల నుండి అందిన సమాచారం మేరకు నిన్నటి దినాన 26 సాయంత్రం మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టర్ వారికి తెలుపగా వారు సత్వరమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదించి సంబంధిత కృష్ణ పట్నం పోర్టు వారి సహకారంతో వెంటనే పెద్ద పడవల సహాయముతో దుగ్గరాజపట్నం వద్ద చిక్కుకుపోయిన IND TN 02 MM2588 బోట్‌తో పాటు బోగోలు మండలం పాతపాలెం, చెన్నరాయునిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులను సురక్షితంగా బుధవారం ఉదయం 10 గంటలకు కృష్ణపట్నం చేర్చడం జరిగిందనీ తెలిపారు.

ఈ సందర్భంగా సదరు మత్స్యకారులు వెంటనే స్పందించి తమను కాపాడిన రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారికి వారి యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *