Breaking News

సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత కోచింగ్‌  ప్రవేశ పరీక్షలకు 70 మంది అభ్యర్థులు హాజరు

-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో  వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం రాజమహేంద్రవరం నందు నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి చక్కటి వేదికని  జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్‌లో ఉదయం 11 గంటలకు సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత కోచింగ్‌కు ప్రవేశ పరీక్ష కొచ్చిన్ పేపర్, ఓఎంఆర్ షీటను కలెక్టర్ పి. ప్రశాంతి, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అధికారులతో కలిసి ఓపెన్ చేశారు. అనంతరం పరీక్ష నిర్వహణను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు – పశ్చిమ గోదావరి జిల్లాలోని కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు , అల్లూరి సీతారామరాజు జిల్లాల నుండి మొత్తం 75 దరఖాస్తులు రాగా, ఈరోజు 70 మంది అభ్యర్థులు సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత కోచింగ్‌  ప్రవేశ పరీక్షలకు హాజరు అయ్యారన్నారు. 5 గురు అభ్యర్థులు హాజరు కాలేదని తెలిపారు. యూపీఎస్సీ సివిల్స్ కోసం ఉచిత కోచింగ్‌లో ప్రవేశానికి కామన్ స్క్రీనింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గొల్లపూడి కేంద్రంలో ఆరు మాసాల పాటు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు వసతులతో కూడిన ఉచితంగా శిక్షణను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఆరు నెలలు కాలంలో ఉపకార వేతనం కూడా అందించడం జరుగుతుందనీ పేర్కొన్నారు. పోటీ పరీక్షలలో గెలుపే లక్ష్యంగా నిరంతర కృషి ద్వారా సాధ్యం అవుతుందని కలెక్టరు పేర్కొన్నారు. సివిల్ కోచింగ్ కు ఎంపికైన అభ్యర్థులు పట్టుదలతో శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణా ను ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి , బిసి స్టడీ సర్కిల్ సంచాలకులు కె .ఎన్. జ్యోతి, బిసి సంక్షేమ అధికారి సత్య రమేష్ , ఆయా జిల్లాల బిసి సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *