అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని తీర్థరాజ్ ప్రయాగరాజ్‌లో జరిగే మహాకుంభ మేళాకు రావాలని సీఎం చంద్రబాబును యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం సీఎం చంద్రబాబుకు యోగీ ఆదిత్యనాథ్ ఆహ్వాన లేఖను పంపారు. యూపి డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే సాంస్కృతిక బృందాలతో పాటు ఆయా సంస్థల ప్రతినిధులకు యూపీ ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గంగాజలం ఇచ్చారు. సిఎం వారిని సత్కరించారు.
Tags amaravathi
Check Also
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం
-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …
Prajavartha Online Telugu News