Breaking News

కుంభమేళాకు రావాలని సీఎం చంద్రబాబుకు యూపీ సీఎం ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని తీర్థరాజ్ ప్రయాగరాజ్‌లో జరిగే మహాకుంభ మేళాకు రావాలని సీఎం చంద్రబాబును యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం సీఎం చంద్రబాబుకు యోగీ ఆదిత్యనాథ్ ఆహ్వాన లేఖను పంపారు. యూపి డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్ ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే సాంస్కృతిక బృందాలతో పాటు ఆయా సంస్థల ప్రతినిధులకు యూపీ ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గంగాజలం ఇచ్చారు. సిఎం వారిని సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *