Breaking News

ప‌టిష్ట స‌మ‌న్వ‌యం, ప‌ర్య‌వేక్ష‌ణ‌తో అర్జీలను ప‌రిష్క‌రించండి

– ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కార వ్య‌వ‌స్థకు 120 అర్జీలు
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వ్య‌వ‌స్థ (పీజీఆర్ఎస్‌) ద్వారా అందిన అర్జీల‌ను ప‌టిష్ట స‌మ‌న్వ‌యం, ప‌ర్య‌వేక్ష‌ణ‌తో ప‌రిష్క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో నిర్వ‌హించిన ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వ్య‌వ‌స్థ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా, డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీ న‌ర‌సింహం, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప్ర‌త్యేక అధికారి జి.జ్యోతి, డీఆర్డిఎ పీడీ కె.శ్రీనివాసరావుతో క‌లిసి ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌తి అర్జీని క్షుణ్నంగా ప‌రిశీలించి, ఎస్‌వోపీ ప్ర‌కారం నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాల‌ని.. ఇందుకు జిల్లాస్థాయి అధికారులు.. క్షేత్ర‌స్థాయి అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు. పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మానికి మొత్తం 120 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 52 అర్జీలు ఉన్నాయి. పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధికి సంబంధించి 24, పంచాయ‌తీరాజ్‌కు సంబంధించి 13, పోలీస్ 8, విద్య‌ 4, పౌర సరఫరాలు 3, విభిన్నప్రతిభావంతులు 2, ఉపాధి కల్పన 2, హౌసింగ్ 2, హెల్త్ 2, దేవాదాయ శాఖ, మైన్స్ అండ్ జియాల‌జీ, మత్స్య శాఖ, నేషనల్ హైవే, స్కిల్ డెవలప్మెంట్, అటవీ, డీఆర్డీఏ,వ్యవసాయ శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ వ‌చ్చాయి. వీటిని నిర్దేశ గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. కార్య‌క్ర‌మంలో వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *