విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ రాజ్య సభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన సానా సతీష్ మర్యాదపూర్వకంగా ఎంపి కేశినేని శివనాథ్ ను శుక్రవారం గురునానక్ కాలనీలోని ఆయన కార్యాలయంలో కలిశారు. రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సానా సతీష్ కి ఎంపి కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలపటంతో పాటు శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి పత్రిమను బహుకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి దండమూడి శ్రీనివాస్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్న), టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, టిడిపి నాయకులు సూరపనేని సురేష్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News