విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో శుక్రవారం ఉదయం డిస్ప్లే డివైస్ ఫీ కమిటీ సభ్యులలు ఏజెన్సీ వారితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిస్ప్లే డివైసెస్ తో సంబంధం ఉన్న ఏజెన్సీలను వారు శుక్రవారం జరిగే సమావేశంలో పాల్గొనవలసిందిగా వారికి నోటు పంపగా వారు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం 28 డిస్ప్లే డివైసెస్ సంబంధించిన ఏజెన్సీలు ఉండగా అందులో ఎనిమిది ఏజెన్సీలు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు వారికి పర్మిషన్ లెటర్, ట్రేడ్ లైసెన్స్, వారు నగర పాలక సంస్థకు పెట్టుకున్న అర్జీలు పరిశీలించారు. నగరపాలక సంస్థకు వారు కట్టవలసిన చెల్లింపులు ఎప్పటి వరకు కడతారు వాటికి ఉన్నవాళ్లకి ఇబ్బందులు ఏంటి అన్న వాటి విషయాలపై చర్చించారు. రాని ఏజెన్సీలకు మరొకసారి సమాచారాన్ని అందచేయాలని టోన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు.
డిస్ప్లే ఫీ కమిటీ హెడ్ అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) చంద్రశేఖర్, కన్వీనర్ చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, సభ్యులు జాయింట్ డైరెక్టర్ (అమృత్) డాక్టర్ లత, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సృజన, అకౌంట్స్ ఆఫీసర్ సత్యనారాయణ, ఇతర టౌన్ ప్లానింగ్ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News