విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు ప్రజలందరికీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఏడాదిలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండమైన విజయం అందించిన పశ్చిమ ప్రజలకు, కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమైనది అన్నారు. పశ్చిమ ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ సేవలను అందిస్తామన్నారు.కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్ధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి ఎన్డీఏ కూటమి సమిష్టిగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని సుజనా చౌదరి ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News