Breaking News

చేతివృత్తిదారులకు నైపుణ్య శిక్షణ… కమిషనర్ పులి శ్రీనివాసులు 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ పరిధిలో వివిధ రకాలైన చేతివృత్తిదారుల (సర్వీసు ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమము ఫేజ్-1)ను గుర్తించి వారికి నైపుణ్య-సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఏసీ, టివి, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ వంటివి మరమ్మతులు చేసేవారు, పెయింటర్, బ్యూటీషియన్ (స్త్రీ, పురుషులు) తదితరులకు తగిన నైపుణ్య, సాంకేతిక శిక్షణ, సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు జీవనోపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. శిక్షణ పూర్తిచేసుకుని హోమ్- ట్రయాంగిల్ లో నమోదు చేసుకున్న ప్రతి సర్వీస్-ప్రొవైడర్ కు ఉచితంగా యునిఫారం మరియు డిజిటల్ ID కార్డు ఇవ్వబడుతుంది. హోమ్-ట్రయాంగిల్ లో నమోదు చేసుకున్న ప్రతి సర్వీస్-ప్రొవైడర్ కు నెలకు కనీసం హ్యాండీమాన్ సేవలకు నెలకు రూ.12,000/- నుండి రూ.15,000/- వరకు మరియు గృహోపకరణాల మరమ్మతు సేవలకు రూ.25,000/- నుండి రూ.35,000/- వరకు సంపాదించవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 4 వ తేది నుండి 7 వ తేది లోపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ నందలి మెప్మా విభాగము (యూనియన్ బ్యాంకు, జి.యం.సి ఎక్ష్టెన్షన్ ఎదురు) నందు తమ పేర్లు, వివరాలతో పాటు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు కాపీలతో పాటు, విద్యార్హత, అనుభవ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు పాస్ బుక్, రేషన్ కార్డు మరియు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు రెండు తదితర వివరాలతో నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సిటి మిషన్ మనేజేర్స్, మెప్మా, వి. మాధవరావు(7780765984), ఎస్.వి. శివ నాగేశ్వరి (8309814869) మరియు డి. పావని (8309815289) తదితరులను సంప్రదించాలని అధికారులు సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *